బాయ్‌ఫ్రెండ్‌తో పట్టుబడిన మల్లికా షెరావత్..
బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ ఓ ఫ్రెంచ్ దేశస్థుడైన వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బుధవారం రాత్రి తన బాయ్‌ఫ్రెండ్ సిరిల్ ఆక్సెన్‌ఫ్యాన్‌తో డిన్నర్ డేట్‌కు వెళ్తుండగా మీడియా కెమెరాలో చిక్కింది.
మల్లికా షెరావత్ తెల్లటి దుస్తులు ధరించగా, సిరిల్ బ్లూ షర్టు, జీన్స్ ప్యాంట్‌లో దర్శనమిచ్చారు. గత కొద్దికాలంగా వీరిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకొన్నారనే ప్రచారం జరుగుతున్నది. కానీ అలాంటిదేమీ జరుగలేదని మల్లికా క్లారిటీ ఇచ్చారు.

ప్రస్తుతం మల్లికా షెరావత్ చేతిలో బాలీవుడ్ చిత్రాలేమీ లేవు. కానీ తన జీవితంలో ముఖ్య సంఘటనల ఆధారంగా జీ టెలివిజన్ రూపొందించే వెబ్ సిరీస్‌లో మల్లికా నటిస్తున్నది. ది స్టోరీ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మల్లికా జీవితంలో చోటుచేసుకొన్న చేదు సంఘటనలను తెరకెక్కించనున్నారు.


Click it and Unblock the Notifications











