స్టార్ హీరో నా తలుపులు బద్దలు కొట్టి.. నా బెడ్ రూమ్‌లోకి.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న దారుణ పరిస్ధితులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చిత్ర సీమలో కలకలం రేగింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మహిళా నటులు , హీరోయిన్లు దీనిపై స్పందించారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైన అనుభవాలు , క్యాస్టింగ్ కౌచ్ తదితర అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ హీరోపై కీలక వ్యాఖ్యలు చేశారు సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్. ఈ వివరాల్లోకి వెళితే :

హేమ కమిటీ నివేదిక ఇండస్ట్రీలోని దారుణ పరిస్ధితులను, పైకి పెద్ద మనుషుల్లా కనిపించే బడా బాబుల బండారాలను బయటపెట్టింది. కేరళ ప్రభుత్వం చేసినట్లుగానే మిగిలిన రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హేమ కమిటీ మాదిరిగానే కమీషన్‌లను ఏర్పాటు చేయాలని పలువురు సినీతారలు కోరారు. నడిగర్ సంఘం ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి వెంటనే యాక్షన్‌లోకి దిగింది. కోలీవుడ్‌లో లైంగిక వేధింపులకు పాల్పడిన వారు హీరో అయినా, నిర్మాత అయినా, దర్శకుడే అయినా తీవ్ర చర్యలుంటాయని నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ తెలిపారు.

mallika Sherawat made sensational comments on an Bollywood super star here s the details

కాగా.. దక్షిణాదిలోనే కాదు.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ క్యాస్టింగ్ కౌచ్, మహిళలపై వేధింపుల ఘటను ఎన్నో. మీటూ ఉద్యమం బాలీవుడ్‌లోనూ రావాలని సీనియర్ నటి కాజోల్ అభిప్రాయపడ్డారు. తనుశ్రీ దత్తా- నానాపటేకర్ వ్యవహారం ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు స్టార్ హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ఏకంగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కూడా లైంగిక వేధింపుల బారినపడ్డారు. 12 ఏళ్ల వయసులో ఆమె ఫోటోలు అశ్లీల వెబ్‌సైట్లలో కనిపించినట్లు స్వయంగా జాన్వీ బయటపెట్టారు. ఇలాంటి ఘటనల వల్ల ఇండస్ట్రీలోని మహిళా నటులు, వారి కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఇకపోతే.. ఒకప్పుడు బోల్డ్ పాత్రలతో దేశాన్ని ఒక ఊపు ఊపిన బాలీవుడ్ సెక్సీ బాంబ్ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫిలాసఫీలో పట్టా పొందిన ఈ ఉన్నత విద్యావంతురాలు సినిమాల్లోకి రాకముందు ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. 2002లో జీనా సిర్ఫ్ మెర్రా లియే సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు మల్లిక. మర్డర్, షాదీ సే పెహ్లే, గురు, హిస్, పాలిటిక్స్ లవ్ వంటి సినిమాలలో హాట్ షోలతో మల్లిక పేరు మారుమోగిపోయింది.

ఇటీవల మల్లిక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కమిట్‌మెంట్‌కు ఓకే చెప్పకపోవడంతో తనను కొన్ని సినిమాల నుంచి తప్పించారని ఆరోపించారు. స్క్రీన్‌పై పొట్టి బట్టలు వేసుకుని హాట్ హాట్‌గా నటించినంత మాత్రాన అది దిగజారిపోయినట్లు కాదని మల్లిక చెప్పారు. ఎంతోమంది స్టార్ హీరోలు తనను హోటల్ రూమ్‌కి పిలిచారని ఆమె బాంబు పేల్చారు. ఆన్ స్క్రీన్ బోల్డ్ క్యారెక్టర్‌లను చూసి కొందరు స్టార్లు ఎలా ప్రవర్తించేవారో మల్లిక వెల్లడించింది. ఓ సూపర్ హిట్ కామెడీ మూవీ చిత్రీకరణ సమయంలో ఓ స్టార్ హీరో తన గదిలోకి బలవంతంగా రావాలని చూశాడని చెప్పింది. అర్థరాత్రి తలుపులు బద్ధలుకొట్టి, బెడ్‌రూమ్‌లోకి రావడానికి ప్రయత్నించాడని మల్లికా షెరావత్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఆ నటుడు ఎవరన్నది మల్లిక వెల్లడించలేదు. అయితే నెటిజన్లు మాత్రం ఆమె నటించిన కామెడీ చిత్రం వెల్‌కమ్ అని ఇందులో హీరో అక్షయ్ కుమార్ అని చెబుతున్నారు. ఆ మూవీ తర్వాత అక్షయ్‌తో మల్లిక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. కమిట్‌మెంట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం వల్లే తనను బాలీవుడ్ దూరం పెట్టిందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లికా షెరావత్ నటించిన విక్కీ విద్యా కా వో వాలా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X