For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృంగార సన్నివేశాల్లో నటిస్తుంటే అలాంటి ఫీలింగ్.. ఇప్పుడు స్టార్లంతా చేసేది అదే కదా: హీరోయిన్

  |

  సినీ ఇండస్ట్రీలో ఒక్కో హీరోయిన్‌కు ఒక్కో రకమైన గుర్తింపు ఉంటుంది. గ్లామరస్ రోల్స్ చేస్తే గ్లామర్ హీరోయిన్ అంటూ.. మంచి పాత్రలు పోషిస్తే టాలెంటెడ్ హీరోయిన్ అంటూ.. శృంగార సన్నివేశాల్లో నటిస్తే బోల్డు హీరోయిన్ అంటూ పిలుస్తుంటారు. ఈ చివరి జాబితాలోకి వచ్చే నటీమణులు బాలీవుడ్‌లో చాలా మందే ఉన్నారు. అందులో సీనియర్ బ్యూటీ మల్లికా శెరావత్ ఒకరు. చాలా కాలం పాటు తన అందాలతో హడావిడి చేసిన ఈ బ్యూటీ.. ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన బోల్డ్ సీన్స్ గురించి స్పందించింది. వివరాల్లోకి వెళ్తే...

  అలా మొదలైన కెరీర్.. ఆ మూవీలో ఎంట్రీ

  అలా మొదలైన కెరీర్.. ఆ మూవీలో ఎంట్రీ


  ఎయిర్ హోస్టెస్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా కాలం పాటు అదే ఉద్యోగం చేసింది మల్లికా శెరావత్. అలాంటి సమయంలోనే మోడల్‌గానూ మారింది. ఈ క్రమంలోనే పలు వ్యాపార ప్రకటనల్లో సైతం నటించింది. అలా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ల దృష్టి పడిందామె. దీంతో ‘జీనా షిర్ఫ్ మేరే లియే' అనే సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ‘ఖ్వాహీస్' అనే సినిమాతో నటిగా పరిచయమైంది.

  ఆ చిత్రాలతో బాగా ఫేమస్ అయిన మల్లిక

  ఆ చిత్రాలతో బాగా ఫేమస్ అయిన మల్లిక


  నటిగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాలోనే మల్లికా శెరావత్ అందాలను ఆరబోసింది. దీంతో ఆమెను ఎనలేని గుర్తింపు వచ్చింది. ఆ వెంటనే చేసిన ‘మర్డర్'లో మరింత రెచ్చిపోయి నటించింది. ఇందులోనైతే ఏకంగా శృంగార సన్నివేశాలు కూడా చేసింది. అప్పుడే ఈ బ్యూటీ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. దీంతో వరుస ఆఫర్లను దక్కించుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది.

  ఎక్కువగా అలాంటివే... రచ్చ చేసేసిందిగా

  ఎక్కువగా అలాంటివే... రచ్చ చేసేసిందిగా


  సుదీర్ఘమైన కెరీర్‌లో మల్లికా శెరావత్ ఎన్నో చిత్రాల్లో నటించింది. చాలా స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది. భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల చిత్రాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే, ఆమె నటించిన వాటిలో ఎక్కువ శాతం బోల్డు పాత్రలే ఉన్నాయి. వీటితోనే దేశంలోని కుర్రాళ్లను ఉర్రూతలూగించింది. తద్వారా ఎంతో మందికి క్రష్‌ అయింది. ఇలా ఈమె ఎనలేని క్రేజ్‌ను అందుకుంది.

  సీక్రెట్‌గా పెళ్లి.. విడాకులతో హాట్ టాపిక్‌గా

  సీక్రెట్‌గా పెళ్లి.. విడాకులతో హాట్ టాపిక్‌గా

  వాస్తవానికి మల్లికా శెరావత్ సినిమాల్లోకి రాకముందే అంటే.. ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తోన్న సమయంలోనే ఓ పైలెట్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడిని సీక్రెట్‌గా వివాహం చేసుకుంది. కానీ, ఈ విషయం మాత్రం చాలా రోజుల వరకూ ఎవరికీ తెలీదు. ఆమె ఎప్పుడైతే అతడికి విడాకులు ఇచ్చిందో.. అప్పుడు మాత్రం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇది దేశం మొత్తం తెలిసింది.

  ఏజ్ పెరిగినా కంటిన్యూ చేస్తోన్న హీరోయిన్

  ఏజ్ పెరిగినా కంటిన్యూ చేస్తోన్న హీరోయిన్


  ఒకప్పుడు వరుస సినిమాలు.. స్పెషల సాంగులతో ఫుల్ బిజీగా గడిపింది మల్లికా శెరావత్. అయితే, ఇప్పుడు మాత్రం ఆమె అంతగా స్పీడు చూపించడం లేదు. కానీ, ఏజ్ బారైనా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉంది. అప్పుడప్పుడూ గ్యాప్ తీసుకుంటూ వెబ్ సిరీస్‌లను కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే బుల్లితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ బ్యూటీ కొన్ని షోలలోనూ చేసింది.

  బోల్డు సీన్స్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వచ్చేదని

  బోల్డు సీన్స్ చేస్తుంటే ఆ ఫీలింగ్ వచ్చేదని

  మల్లికా శెరావత్ తాజాగా ఓ నేషనల్ మీడియాతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలపై స్పందించింది. అదే సమయంలో తన సినిమాలు, పాత్రల గురించి కూడా మాట్లాడింది. ‘నేను శృంగార సన్నివేశాల్లో నటించినప్పుడు నైతికంగా చనిపోయిన ఫీలింగ్ వచ్చేది. అంతలా అవి నాపై బోల్డ్ హీరోయిన్ అనే ముద్రను వేశాయి' అంటూ చెప్పుకొచ్చిందామె.

  Mallika Sherawat Fires On Bollywood Director || Filmibeat Telugu
  ఇప్పుడు స్టార్లు అదే చేస్తున్నారని కామెంట్

  ఇప్పుడు స్టార్లు అదే చేస్తున్నారని కామెంట్


  దీనిని కంటిన్యూ చేస్తూ.. ‘నేను అప్పుడు చేసిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో.. అవి ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. ప్రజల దృష్టి కూడా మారిపోయింది. అందుకే వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. అయినా.. ఇప్పటి సినిమాల్లో మహిళా సాధికారిత పెద్దగా కనిపించట్లేదు. ఆడవాళ్లకు మంచి పాత్రలు రావడం లేదు' అంటూ మల్లికా శెరావత్ ఆవేదన వ్యక్తం చేసింది.

  English summary
  Bollywood Senior Actress Mallika Sherawat Done So Many Films like Bold. Now She Open About Bold Scenes Experience in Her Movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X