నీ నడుముపై చపాతీలు కాల్చుకుంటా .. మల్లికా షెరావత్‌కు నిర్మాత వేధింపులు

మల్లికా షెరావత్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, మత్తెక్కించే ఫిగర్‌తో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. బోల్డ్ సీన్స్, స్పెషల్ సాంగ్స్‌తో సంచలనం సృష్టించింది. మల్లికా షెరావత్‌ను చూపిన బాటలో పలువురు హీరోయిన్లు ఈ తరహా పాత్రల్లోకి ప్రవేశించి స్టార్ డమ్ అందుకున్నారు. గ్లామర్ పాత్రలకు కేరాఫ్‌గా నిలిచిన మల్లికా షెరావత్.. హిందీతో పాటు పలు దక్షిణాది చిత్రాల్లోనూ నటించింది. ఎందుకో తెలియదు కానీ 2012 నుంచి చిత్ర పరిశ్రమకు దూరమైంది.

బాలీవుడ్ సెక్సీ బాంబ్‌గా ఘనత
జీనా సిర్ఫ్ మేరే లియే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది మల్లికా షెరావత్. తర్వాత మర్డర్, ఖాహిస్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, ఆప్ కా సరూర్, దశావతారం, డబుల్ ధమాల్‌ తదితర చిత్రాల్లో నటించింది మల్లిక, సినిమాలలో తన బోల్డ్ నటనతో బాలీవుడ్‌లో సెగలు రేపింది. చైనీస్ భాషలో ది మైత్, టైమ్ రైడర్స్‌తో పాటు హాలీవుడ్‌లో హిస్, పాలిటిక్స్ ఆఫ్ లవ్ వంటి సినిమాలలో నటించింది. సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందే ఢిల్లీకి చెందిన పైలట్ కరణ్ సింగ్ గిల్‌ను 1997లో పెళ్లి చేసుకుంది మల్లిక. అయితే కొన్నేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. తన పెళ్లి, విడాకుల సంగతిని మల్లిక సీక్రెట్‌గా ఉంచారని బాలీవుడ్‌లో చెప్పుకుంటారు. అయితే ఫ్రాన్స్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ సిరిల్లె ఆక్సెన్‌ఫాన్స్‌తో మల్లిక డేటింగ్ చేసింది.

Mallika Sherawat Recalls once a producer wanted to heat chapatis on her waist for song

సామాజిక కార్యక్రమాల్లోనూ దూకుడుగా
సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో మల్లికా షెరావత్ పాల్గొనేవారు. మహిళా హక్కులపై పోరాడుతున్నారు. అలాగే 2014లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో మహిళల సమస్యలపై చర్చించేందుకు మల్లికా షెరావత్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఆహ్వానం అందింది. 49 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్రభామలకు పోటీ ఇస్తున్నారు మల్లికా షెరావత్. ఇప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటో షూట్‌లతో సెగలు రేపుతున్నారు ఈ ముదురు భామ.

నిర్మాత వేధింపులు
సినిమాలలో బోల్డ్ నటనతో పాటు బయట కూడా బోల్డ్ కామెంట్స్ చేస్తూ సంచలనం సృష్టించడంలో మల్లికా షెరావత్ ముందుంటుంది. కొన్నేళ్ల క్రితం విక్కీ విద్యా కా వో వలా వీడియో సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చిన మల్లికా షెరావత్.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ది లవ్ లాఫ్ లైవ్ షోలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఓ నిర్మాత తనను ఎంతగా వేధించినది బయటపెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..

నీ నడుముపై రొట్టెలు కాల్చుకుంటా
ఓ సినిమాలోని సాంగ్ చిత్రీకరణపై డిస్కషన్ నడుస్తుండగా ఓ నిర్మాత తన వద్దకు వచ్చి ఐటెం సాంగ్ ఒకటి చేయాల్సి ఉందని చెప్పారని మల్లిక తెలిపారు. మీరు చాలా హాట్ అన్న విషయం ప్రేక్షకులకు తెలియాలంటే మీ నడుముపై రొట్టెలు కాల్చే సీన్ చేద్దామని చెప్పాడని ఆమె వెల్లడించారు. ఆ మాట వినగానే తనకు నవ్వొచ్చిందని.. ఆ తర్వాత షాక్ అయ్యానని మల్లిక చెప్పింది. ఈ సీన్ చేసేందుకు తాను ఒప్పుకోలేదని ఆమె గుర్తుచేసుకుంది. ఇండియాలో హాట్ నెస్ అంటే సరిగ్గా తెలియదని.. ఇది ఎంతో విచిత్రమని మల్లిక పేర్కొన్నారు. అయితే గతంతో పోలిస్తే పరిస్ధితులు ఇప్పుడు చాలా మెరుగుపడ్డాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం మల్లికా షెరావత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె నడుముపై రొట్టెలు కాల్చాలని అడిగిన నిర్మాత ఎవరు? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Read more about: mallika sherawat bollywood news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X