నా బొడ్డుపై ఆ హీరో అలాంటి పని.. సౌత్ దర్శకుడిపై మల్లికా షెరావత్ మండిపాటు!
ఇండియన్ సినిమా పరిశ్రమలో అత్యధిక పాపులారిటీ ఉన్న శృంగారతారల్లో మల్లికా షెరావత్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. తన అందచందాలతో వెండితెరను వేడెక్కించిన వారిలో ఒకరంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. కేవలం అందచందాలే కాకుండా నటనతో ఆకట్టుకొనే ఆమెకు దక్షిణాదిలో ఓ హీరో, దర్శకుడి చేతిలో చేదు అనుభవం ఎదురైందనే విషయం తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌లో వెల్లడించిన వివరాలు షాకింగ్‌గా మారాయి. మల్లిక చెప్పిన ఆ వివాదాస్పద అంశం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలోనే కాకుండా చైనీస్ భాషల్లో కూడా నటించిన తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొన్నది. అయితే కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఆమె దక్షిణాది సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే సౌత్‌లో ఆమె పెద్దగా నటించిన దాఖలాలు లేవు. కానీ నటించిన కొద్ది సినిమాల్లోనే ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురైందట.

మల్లికా షెరావత్ నటించిన సౌత్ సినిమాల విషయానికి వస్తే..ప్రేమ్ దర్శకత్వంలో ఏక్ ప్రీతి యేకే భూమి మెలిదే అనే కన్నడ సినిమా ద్వారా దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో కమల్ హాసన్ హీరోగా దశవతారం, ఎస్ ధరణి దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందిన ఓస్తే అనే తమిళ సినిమాల్లోను, తాజాగా వాడివుడియాన్ దర్వకత్వంలో పంబట్టామ్ అనే తమిళ సినిమాలో చివరిగా నటించింది.
దక్షిణాదిలో ఓ సినిమా షూటింగ్‌లో ఓ దర్శకుడు నాతో మాట్లాడుతూ.. మీరు చాలా హాట్‌గా ఉన్నారు. మీ హాట్ మొత్తాన్ని తెరపైన చూపించాలని అనుకొంటున్నాను. అందరూ చూపించినట్టు కాకుండా నేను కొత్తగా, డిఫరెంట్‌గా ఎవరూ మిమ్మల్ని చూపించని విధంగా చూపిస్తానని నాతో అన్నాడు. కానీ ఆయన చెప్పిన విషయం విని నాకు మతిపోయింది అని ఆమె చెప్పారు.

అయితే సౌత్‌కు సంబందించి ఓ సినిమాలోని పాట చిత్రీకరణ జరుగుతున్నది. ఆ సమయంలో మీరు ఎంత హాట్‌గా ఉన్నారో స్క్రీన్ మీద సింబాలిక్‌గా చెప్పాలని అనుకొంటున్నాను. మీరు పడుకొంటే మీ నడుము పైభాగంలో హీరో వచ్చి చపాతి చేస్తాడు. పచ్చి చపాతీ మీ బొడ్డు ప్రాంతంలో వేస్తే.. కాలిన చపాతీ అవుతుందని సీన్ వివరించారు. ఆ విధంగా ఓ మహిళతో సీన్ షూట్ చేస్తారా? అని షాక్ గురయ్యాను అని మల్లికా షెరావత్ చెప్పింది.
మల్లికా షెరావత్ కెరీర్ విషయానికి వస్తే..తాజాగా త్రిప్తి డిమ్రీ, రాజ్ కుమార్ రావ్ కాంబినేషన్‌లో వచ్చిన విక్కీ విద్యా కా ఓ వాలి వీడియో సినిమాలో నటించింది.ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది దర్శకుడు చేసిన పనిని ఆమె గుర్తు చేసుకొన్నది. ప్రస్తుతం ఆమె తాజా ఇంటర్వ్యూ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే ఆ హీరో ఎవరు? దర్శకుడు ఎవరనే వివరాలు వెల్లడించడానికి ఆమె నిరాకరించారు.


Click it and Unblock the Notifications











