సూపర్ హాట్‌గా ఉన్నావు.. నీ నడుముపై చపాతీలు వేసుకొంటా.. మల్లికా షెరావత్‌కు నిర్మాత వేధింపులు
బాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరైన మల్లికా షెరావత్ మరో సారి షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఓ లైవ్ షో సందర్భంగా సినిమాకు సంబంధించిన ఒక షాకింగ్ విషయాన్ని గురించి చెప్పుకొచ్చారు ఆమె, ఆ వ్యవహారం వింటే మీరు కూడా స్టన్ అవుతారు. ఆ వివరాల్లోకి వెళితే

ఆసక్తికర విషయాలు
మల్లికా షెరావత్ ఇటీవల 'ది లవ్ లాఫ్ లైవ్ షో' లైవ్ షోలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో, షూటింగ్ సమయంలో ఒక నిర్మాతతో తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఒకప్పుడు నిర్మాత నా ముందు ఓ విచిత్రమైన డిమాండ్ పెట్టాడు అని వెల్లడించింది. మల్లికా షెరావత్ మాట్లాడుతూ, ఒక పాట చిత్రీకరిస్తున్నప్పుడు, ఆమె నడుముపై రొట్టెలు కాల్చే సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్మాత డిమాండ్ చేశారట.

నడుమ మీద చపాతీలు
అయితే నిర్మాత చేసిన ఈ డిమాండ్‌ను విని షాక్ అయ్యానని వెంటనే నేను మాత్రం చేసేది లేదని చెప్పేశానని ఆమె వెల్లడించారు. ఈ ఆలోచన చాలా ఫన్నీగా మరియు అసలైనదిగా అనిపించిందని మల్లిక తెలిపింది. మల్లికా మాట్లాడుతూ.. ఆ పాట చిత్రీకరణ సమయంలో నిర్మాత తన వద్దకు వచ్చి "ఇది చాలా హాట్ సాంగ్ అండీ, మరి మీరు హాట్ గా ఉన్నారని ప్రేక్షకులకు ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారట.

అందుకే కాలుస్తా అన్నాడు
అందుకే మీరు చాలా వేడిగా ఉన్నారు అని అర్ధం అయ్యేలా నేను మీ నడుముపై చపాతీ కాలుస్తానని అన్నారు. ఇది విన్న మల్లిక 'ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా?' అని నిర్మాతను అడిగిందట, ఆయన లేదని సమాచారం ఇచ్చారట. ఇక తర్వాత మల్లిక మాట్లాడుతూ, నిర్మాత యొక్క ఈ వింత డిమాండ్‌ను నెరవేర్చడానికి నేను నిరాకరించానని చెప్పింది. అయితే ఇది చాలా ఫన్నీ మరియు అసలైన ఆలోచన అని నేను తరువాత అనుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు పర్వాలేదు కానీ
ఇక ఈ షోలో మల్లిక అడిగిన ప్రశ్నలకు ఓపెన్‌గా సమాధానమిచ్చి తన మనసులోని మాటను బయట పెట్టింది. ఇండియాలో హాట్‌నెస్ అంటే ఏమిటో తనకు తెలియదని ఆమె అన్నారు. ఇది నిజంగా విచిత్రం అని కూడా అన్నారు. "భారతదేశంలో మహిళలకు సంబంధించిన హాట్‌నెస్ భావన చాలా వింతగా ఉంది. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పరిస్థితులు మెరుగుపడ్డాయని నేను అంగీకరిస్తున్నాను కానీ నేను నా కెరీర్ ప్రారంభించినప్పుడు, అది వింతగా ఉంది. అని ఆమె అన్నారు.
Recommended Video

సినిమాల విషయానికి వస్తే
మల్లికా శెరావత్ బాలీవుడ్ హాటెస్ట్ నటీమణులలో ఒకరిగా పరిగణించబడుతుంది . ఖ్వైష్, మర్డర్ వంటి చిత్రాలలో ఆమె నటించింది. ఆమె తన పాత ఇంటర్వ్యూలలో తన సినీ కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించింది. ఇక చివరిగా మల్లికా MX ప్లేయర్‌లోని వెబ్ సిరీస్ నకాబ్‌లో కనిపించింది. ఈ వెబ్ సిరీస్‌లో ఆమెతో పాటు ఈషా గుప్తా మరియు గౌతమ్ రోడే కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ యొక్క స్క్రిప్ట్ హై ప్రొఫైల్ సెలబ్రిటీ మర్డర్ కేసు ఆధారంగా రూపొందించబడింది. ఇక మల్లిక ఏ నిర్మాత గురించి కామెంట్ చేసిందో మరి?


Click it and Unblock the Notifications











