Hiss మూవీ ఫోటోను పోస్ట్ చేసిన మల్లికా శెరావత్.. ఆ బోల్డ్ తనమే నాకు అంటూ!
బాలీవుడ్‌లోని అత్యంత శృంగారతారల్లో మల్లికా షెరావత్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆమె అందాల అరబోతలో తనకు తానే సాటి అని నిరూపించుకొన్నారు. అంతేకాకుండా తాను గొప్ప ఫెర్ఫార్మర్ అనే విషయాన్ని కూడా పోషించిన పాత్రలతో సినీ లోకానికి చాటి చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ఈ అందాల భామ కాస్త కుర్రకారుకు జోష్ పుట్టించడం ఆపేసింది. తాజాగా ఫోటోలను షేర్ చేసి ఎమోషనల్‌గా ఏం పోస్టు పెట్టిందంటే?
మల్లీకా షెరావత్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. జీనా సిర్ఫ్ మేరే లియే అనే సినిమాతో మొదలైంది. ఆ తర్వాత మర్డర్ సినిమా ఆమెకు ఎక్కడా లేని పాపులారిటీని తెచ్చి పెట్టింది. ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్, గురు, హిస్, డబుల్ ధమాల్, తేజ్, వెల్‌కమ్ లాంటి చిత్రాల్లో నటించింది.

అయితే గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ పాత్రలు చేసినప్పటికీ.. ఆమెకు రావాల్సినంత, ఆమెకు ఉన్న టాలెంట్‌కు సరిపడా గుర్తింపు రాలేదు. ఆమె చివరిగా డర్టీ పాలిటిక్స్, టైమ్ రైడర్, జీనత్, పంబట్టామ్ చిత్రాల్లో నటించింది. అయితే తానకు అత్యంత గుర్తింపు తెచ్చిన హిస్ సినిమా గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టి భావోద్వేగానికి గురి అయింది.
నా కెరీర్ మొత్తంలో వెండితెర మీద బోల్డ్ సీన్లు, పాత్రలు చేసి కొన్నిసార్లు పశ్చత్తాపం చెందాల్సి వచ్చింది. కొన్ని అభ్యంతరకరమైన సంఘటనలు చూడాల్సి వచ్చింది. సంప్రదాయ పాత్రలను విస్మరించినందుకు నన్ను చాలా రకాలుగా జడ్డ్ చేశారు. నేను వేసుకొనే బట్టలను బట్టి నా బిహేవియర్‌ను లెక్క కట్టారు. ఓ మహిళను సమాజం ఎలా కంట్రోల్‌లో పెడుతారో.. నన్ను కూడా అలాగే లెక్క కట్టారు అని అన్నారుు.

వివాదాస్పద థిమ్స్‌తో నేను ఎంచుకొన్న పాత్రలు నాకు ఛాలెంజ్ విసిరాయి. సంప్రదాయవాదులకు నా ఎంపిక గిట్టలేదు. అయినా నాకు నచ్చినట్టు నేను బతికాను. నచ్చిన పాత్రలు, సినిమాల్లో నటంచాను అని అన్నారు. మహిళ చైతన్యం పేరుతో ఆడవాళ్లను బందీలుగా మార్చవద్దనే విధంగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఒకరిని జడ్జ్ చేయడం కంటే.. వారు ఎంచుకొన్న, తీసుకొన్న బోల్డ్ నిర్ణయాలను సెలబ్రేట్ చేసుకొనేలా ప్రోత్సాహించాలి. వారి ధైర్యానికి మెచ్చుకోవాలి. సంప్రదాయ సరిహద్దులు దాటుతుందనే అపవాదు వేయకుండా ఉంటే చాలు అని మల్లికా షెరావత్ పేర్కొన్నారు. ఈ మెసేజ్‌తోపాటు ఓ న్యూడ్ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకొన్నారు.


Click it and Unblock the Notifications











