ఆ స్టార్స్ కాంప్రమైజ్ అవ్వమని అడిగారు.. అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా వెళ్లాలి: మల్లికా శెరావత్

క్యాస్టింగ్ కౌచ్ అనేది చిత్ర పరిశ్రమలో ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది సినీనటి మణులు చాలా ఓపెన్ గానే కొంతమంది అగ్రదర్శక నిర్మాతల సీక్రెట్స్ ను బయటపెట్టారు. అవకాశాలు కావాలి అంటే వారికి నచ్చినట్లు ఉండాలి అని మరి కొంతమంది వివరణ ఇచ్చారు. ఇక రీసెంట్ గా సీనియర్ గ్లామరస్ బ్యూటీ మల్లికా శెరావత్ కూడా ఓవర్గం స్టార్ హీరోలు అయితే కమిట్మెంట్ అడిగినట్లుగా ఆ బ్యూటీ పరోక్షంగా వివరణ అయితే ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 అప్పట్లో ఘాటైన రొమాన్స్

అప్పట్లో ఘాటైన రొమాన్స్

ఒకప్పుడు గ్లామరస్ అందాలతో వెండితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న మల్లికా శరావత్ ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఆమె మొదట్లో చేసిన సినిమాల్లో అయితే ఘాటైన ముద్దులతో అలాగే రొమాంటిక్ సన్నివేశాలతో కుర్రకారుకు పిచ్చెక్కించింది. అంతేకాకుండా కొన్ని సన్నివేశాల డోస్ ఎక్కువ కావడంతో విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది.

దీపికా పదుకొనెపై కామెంట్స్

దీపికా పదుకొనెపై కామెంట్స్

అయితే మల్లికా శెరావత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాల గురించి కూడా ఓపెన్ గానే తెలియజేసింది. అలాగే దీపికా పదుకొనే పై కూడా ఆమె విభిన్నంగా స్పందించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే ఇంటిమేట్ సీన్స్ లో అప్పుడు నేను నటిఎంసీబీనప్పుడు చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఇటీవల గేహ్రాయాం సినిమాలో దీపికా పదుకొనే అలా నటిస్తే మాత్రం ప్రశంసలు కురిపించారు అని మల్లికా తెలియజేసింది.

 క్యాస్టింగ్ కౌచ్

క్యాస్టింగ్ కౌచ్

అయితే చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ ఉందా లేదా అనే విషయంలో కూడా మల్లికా శెరావత్ తనదైన శైలిలో వివరణ ఇవ్వడం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిని అంటూ ఆ రూట్లో వెళ్ళనందుకు తనకు చాలా అవకాశాలు రాలేవని ఓవర్గం హీరోలు అయితే తన గురించి తెలిసి నన్ను కావాలని సినిమాలకు దూరం చేశారు అని మల్లికా వివరణ ఇచ్చింది.

కావాలని తీసేశారు

కావాలని తీసేశారు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అప్పట్లో ఉండే A లిస్టు హీరోలంతా కూడా నాతో పని చేయడానికి ఒప్పుకోలేదు. దర్శక నిర్మాతలు నన్ను సెలెక్ట్ చేసిన కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు అని నన్ను సినిమాల్లో ఉండకుండా చేశారు. ఎవరైతే వాళ్ళ కంట్రోల్ లో ఉంటారో అలాగే వాళ్ళు చెప్పినట్టు చేస్తారో వారికే అవకాశాలు ఇచ్చేవారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా అలాంటి దారిలో అవకాశాలు అందుకోలేదు. ఆ విషయం వాళ్లకు కూడా బాగా తెలుసు.. అని మల్లికా తెలియజేసింది.

అర్ధరాత్రి పిలిచేవారు

అర్ధరాత్రి పిలిచేవారు

సినిమా ఇండస్ట్రీలో ఎవరికి కూడా నేను లొంగాలని అనుకోలేదు. నా టాలెంట్ ను బట్టి నేను అవకాశాలు మాత్రమే అందుకోవాలని అనుకున్నాను. నాకు నచ్చిన పాత్రల్లో చేయాలని అనుకున్నాను. కానీ A లిస్టు హీరోలు అప్పట్లో కూర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి.. అర్థరాత్రి 3 గంటలకు ఫోన్ చేసినా కూడా వెళ్లిపోయే విధంగా పరిస్థితి ఉండేది.

అలా ఉంటేనే ఆ హీరోలు వారి సినిమాల్లో హీరోయిన్స్ కు అవకాశాలు ఇచ్చేవారు. ఒకవేళ వారికి నచ్చినప్పుడు పిలిచినా వెళ్లకపోతే సినిమాల్లో నుంచి తీసివేయడానికి ఏమాత్రం వెనుకాడరు. కానీ సినిమాల కోసం నా క్యారెక్టర్ మాత్రం నేను ఎప్పటికీ తగ్గించుకోవడానికి ఇష్టపడలేదు.. అని మల్లికా శెరావత్ తెలియజేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X