ఆ రాత్రి మోహన్‌లాల్ లేకపోతే.. ఆ యాక్టర్ చేతుల్లో నా జీవితం నాశనం..  యువ హీరోయిన్ కంటతడి

మలయాళ సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యపై రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ కమిటీ నివేదిక ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. హేమ కమిటీ నివేదికలో ఎన్నో విస్తుగొలిపే నిజాలు పరిశ్రమలో వెలుగుచూశాయి. మాలీవుడ్ ఇండస్ట్రీలో మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ సంచలన నివేదిక వెల్లడించింది. ఈ తరుణంలో ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు వస్తున్నారు. తాము అనుభవించిన వేధింపులను మీడియా ముందు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువ నటి శివాని కూడా ముందుకు వచ్చింది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి నోరు విప్పింది.

యంగ్ హీరోయిన్ శివాని మాట్లాడుతూ.. "నా సినీ జీవితంలో నాకు కూడా ఒక చేదు అనుభవం ఎదురైంది. తొలి సినిమాలో నటించే సమయంలో ఓ నటుడు అర్థరాత్రి నా తలుపు తట్టాడు. నేను తెరవకముందే పారిపోతాడు. ఆ సమయంలో మా అమ్మ నాతో ఉంది. అసలూ ఎవరో అని తెలుసుకోవడానికి ప్రత్నించాం. వెంటనే ఈ విషయాన్ని హోటల్ రిసెప్షన్‌కు తెలియజేసాం, అక్కడ ఒక వ్యక్తి ఈ పని చేస్తున్నాడని వారు చెప్పారు. కానీ, అతని వివరాలు చెప్పలేకపోయారు. కానీ, తమని వేధిస్తున్న ఆకతాయి కోసం నేను తీవ్రంగా ప్రయత్నించాను. ఎట్టకేలకు ఆ వ్యక్తి ఎవరో కనుక్కున్నాం. అతడు సినిమా పరిశ్రమలో పలుకుబడున్న వ్యక్తి అనీ, అతడు కూడా నటుడని తెలిసింది. నేను అతనికి వార్నింగ్ ఇవ్వడంతో వేధింపులు ఆగిపోయాయి.

Mallywood actor Shivani Bhai opens up amid harassment row

అయితే.. ఈ పరిణామం తరువాత నాకు చాలా కాలం సినిమా ఆఫర్లు రాలేదు. నన్ను ఏ సినిమాలోకి తీసుకోవద్దని ఆ నటుడు మూవీ మేకర్స్ కి వార్నింగ్ ఇచ్చినట్టు నాకు తెలిసింది. చాలా ప్రయత్నాల తరువాత చివరకు 'చైనా టౌన్' చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో మళ్లీ ఆ వ్యక్తి నన్ను చూశాడు, నాతో చాలా స్నేహపూర్వకంగా మాట్లాడాడు. కానీ షూటింగ్ సమయంలో, మా మధ్య ఏదైనా సమస్య ఉందా అని అడిగాడు, నేను నో చెప్పాను. అప్పటి వరకు అంత బాగానే ఉన్నా ఆ వ్యక్తి (నటుడు) తనను సినిమాలో కనిపించకుండా చేయాలని ప్రయత్నించినట్టు ఆ తర్వాత అర్థమైంది. షూటింగ్ కోసం పిలిచి నాలుగు రోజులైనా.. లోకేషన్ లోకి పిలివలేదు. యితే ఆ సమయంలో హీరో మోహన్‌లాల్ నాకు అండగా నిలిచారు. నేను సినిమాలో నటించే అవకాశాన్ని కల్పించారు. '' అని కన్నీరు మున్నీరైంది యువ హీరోయిన్ నటి శివాని.

"ఇలా ప్రతి ఒక్కరి కథలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. సినిమాల మీద ప్రేమతో మేమంతా ఇండస్ట్రీలో చేరాం. ఇలాంటి ప్రవర్తన ఎవరికీ రాకూడదు.. అదే సమయంలో కేవలం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసమే తప్పుడు ఆరోపణలు చేయకూడదు. ఇదే మా నిజమైన బ్రతుకుల పోరాటం." శివాని ఆవేదన వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X