‘ఆ డైరెక్టర్ హోటల్‌కి రమ్మన్నాడు... తండ్రిలా భావిస్తే, ముద్దు పెట్టాలని దారుణంగా’
ఎన్నో కలలు, ఆశలతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అమ్మాయిలను అవకాశాల పేరుతో ట్రాప్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు కొందరు పెద్ద మనుషులు. క్యాస్టింగ్ కౌచ్‌పై నిత్యం ఎవరో ఒకరు మీడియా ముందుకు వస్తూనే ఉన్నారు. వెండితెర, బుల్లితెరతో పాటు చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. సామాన్యులే కాదు ఇండస్ట్రీలోని స్టార్ కిడ్స్ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ బారినపడ్డ వారిలో ఉన్నారంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. తాజాగా మరో హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
దీపక్ చాహర్‌కు స్వయానా అక్క
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ అక్క మాల్టీ చాహర్ సినీరంగంలో రాణిస్తున్నారు. 2018 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సపోర్ట్‌గా మైదానంలో సందడి చేసి క్రేజ్ సంపాదించుకున్నారు మాల్టీ చాహర్. 2017లో మేనిక్యూర్ అనే సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ... జీనియస్, ఇష్క్ పాష్‌మినా, ది లవర్స్, మా ఓ మేరి మా,. సదా విహా హోయా జీ తదితర చిత్రాలలో నటించారు. నటిగా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా మాల్టీ చాహర్ రాణిస్తున్నారు. అలాగే ఇటీవల ముగిసిన బిగ్‌బాస్ హిందీ 19 లోనూ కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు మాల్టీ చాహర్. దాదాపు 8 వారాల పాటు హౌస్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇందుకు రెమ్యునరేషన్ కింద 16 నుంచి 24 లక్షల రూపాయలు అందుకున్నట్లు బాలీవుడ్ టాక్.

డైరెక్ట్‌గా అది కావాలని అడగరు
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మాల్టీ చాహర్... తన కెరీర్‌లో పడిన ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు తనకు క్యాస్టింగ్ డైరెక్టర్‌లతో ఎలాంటి ఇబ్బందులు పడలేదని.. వారు నాతో చాలా గౌరవంగా, హుందాగా వ్యవహరించే వారు. అయితే ఓ దర్శకుడు మాత్రం సినిమా గురించి మాట్లాడుతూ.. అసభ్యంగా సైగలు చేసేవాడు. కొందరు తమ మనసులోని ఉద్దేశ్యాన్ని వేరే రకంగా మనకి తెలియజేస్తారని మాల్టీ అన్నారు.
హోటల్ రూమ్ నెంబర్ ఇచ్చాడు
అయితే దక్షిణాదిలో ఓ సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడి ఓ డైరెక్టర్ మాత్రం నేరుగా చెప్పకుండా హోటల్‌లో మాట్లాకుందామని అతని హోటల్ గది నెంబర్ ఇచ్చాడు. అతని ఉద్దేశం నాకు అప్పుడే అర్ధమవ్వగా.. ఏం తెలియదు అన్నట్లుగా నటించా, ఈ ఘటన తర్వాత మరోసారి అతనిని నేను కలవలేదు. మరో ఘటనలో ఓ మీటింగ్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా ఓ పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి వీడ్కోలు చెబుతూ హగ్ చేసుకున్నాడు అని మాల్టీ చెప్పారు.
కాస్తుంటే ముద్దు పెట్టేవాడు
అయితే ఇంతలోనే అతను నన్ను ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడు.. జరిగిన పరిణామానికి షాకైనా తర్వాత కోలుకుని అతనిని పక్కకి తోసేశా. అప్పటికప్పుడే ఆ వ్యక్తిని పట్టుకుని నిలదీశా.. తండ్రి స్థానంలో అతనిని ఊహించుకుంటే ఆ వ్యక్తి మాత్రం దారుణంగా ప్రవర్తించాడు. అంతేకాదు.. ఇకపై ఎవరినీ గొప్పగా ఊహించుకోకూడదని ఈ ఘటన నాకు పాఠాలు నేర్పింది. అలాగే మహిళలు అవకాశాల కోసం ఇలాంటి వాటికి ఒప్పుకోవద్దని, మన హద్దుల్లో మనం ఉండాలని మాల్టీ చాహర్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మాల్టీతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ సౌత్ దర్శకుడు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు.


Click it and Unblock the Notifications











