క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన హీరోయిన్.. 11 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ.. అప్పట్లో రాజమౌళికే షాక్ ఇచ్చేంతలా...

గ్లామర్ తో ఎంత మెప్పించినా కూడా యాక్టింగ్ విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపించకపోతే హీరోయిన్స్ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండలేరు. అంతేకాకుండా నిత్యం యువ హీరోయిన్ల నుంచి పోటీ అనేది ఉంటుంది. వాళ్ళందరిని ఎదుర్కోవాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక ఒకప్పుడు కెరీర్ స్టార్టింగ్ లోనే అగ్ర హీరోయిన్స్ కు గట్టి పోటీని ఇచ్చిన నటిమణులలో మమతా మోహన్ దాస్ ఒకరు. కరెక్ట్ గా బిజీ అవుతున్న క్రమంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడింది. అనంతరం పోరాడి గెలిచింది. ఇప్పుడు తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీకి సిద్ధమైంది. ఇక ఆమె ప్రతిభకు అప్పట్లో రాజమౌళి కూడా షాక్ అయ్యాడు.

30 రోజుల్లో ప్రేమించడం ఎలా హీరోయిన్ ఫోటోషూట్ వైరల్.. సరికొత్త అందాలతో

 పవర్ఫుల్ పాత్రలతో..

పవర్ఫుల్ పాత్రలతో..

మమతా మోహన్ దాస్ అంటే తెలుగు ఆడియెన్స్ బాగా తెలిసిన పేరే. అప్పట్లో ఆమె చేసిన పవర్ఫుల్ పాత్రలు అభిమానుల గుండెల్లో బలంగా పాతుకు పోయాయి. డిజాస్టర్ సినిమాలు చేసినా కూడా ఆమె నటన విషయంలో మాత్రం ఆడియెన్స్ ఎప్పుడు నిరాశ చెందలేదు. ఎలాంటి పాత్ర చేసినా కూడా వంద శాతం న్యాయం చేసేది.

 కేవలం నటిగానే కాకుండా

కేవలం నటిగానే కాకుండా

మమతా మోహన్ దాస్ కేవలం నటిగానే కాకుండా సింగర్ గా కూడా మంచి గుర్తింపు అందుకుంది. అలాగే యమదొంగ సినిమాలో ఆమె ఎన్టీఆర్ తో సమానంగా నటనలో పోటీని ఇచ్చింది. ఇక డ్యాన్స్ లో కూడా అన్ని వర్గాల ఆడియెన్స్ ను మెప్పించింది.

 రాజమౌళి షాక్ అయ్యేలా..

రాజమౌళి షాక్ అయ్యేలా..

మమతా మోహన్ దాస్ కెరీర్ మొత్తంలో అందరూ ఎక్కువగా గుర్తు పెట్టుకునే సినిమా యమదొంగ. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమాలో ఒక స్పెషల్ గ్లామరస్ పాత్రలో కనిపిస్తూనే లేడి యమధర్మరాజు ఆహార్యంతో ఎన్టీఆర్ కు గట్టి పోటీని ఇచ్చింది. ఆమె నటనను చూసి దర్శకుడు రాజమౌళి అప్పట్లో షూటింగ్ స్పాట్ లోనే షాక్ అయ్యేవారట.

 క్యాన్సర్ ను ఓడించింది.

క్యాన్సర్ ను ఓడించింది.

ఇక మమతా జీవితాన్ని క్యాన్సర్ గట్టి దెబ్బ కొట్టింది. 2011లో క్యాన్సర్ ట్రీట్మెంట్ కు సిద్దమవుతున్న తరుణంలోనే భర్తతో విడాకులు కూడా తీసుకుంది. ఆ మహమ్మారి ఎంత భయంకరంగా మారినా కూడా మమతా మోహన్ దాస్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఒంటరిగానే అమెరికాకు వెళ్లి చికిత్స చేసుకున్న అనంతరం మళ్ళీ సాదారణ స్థితికి చేరుకుంది. మొత్తానికి మమతా మొండితనంతోనే క్యాన్సర్ ను ఓడించింది.

 11 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా..

11 ఏళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా..

ఇక మళయాళ సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా సినిమాలు చేస్తున్న మమతా 11 ఏళ్లుగా తెలుగు సినిమాలను టచ్ చేసింది లేదు. ఆమె చివరగా నాగార్జునతో కేడి అనే సినిమా చేసింది. ఆ సినిమా ప్లాప్ అయిన తరువాత క్యాన్సర్ బారిన పడడం అలాగే భర్తతో విడాకులు అవ్వడంతో ఇతర ఇండస్ట్రీల వైవు చూడలేదు.

తెలుగులో సరికొత్తగా రీ ఎంట్రీ

తెలుగులో సరికొత్తగా రీ ఎంట్రీ

ఇక ఇన్నాళ్లకు ఆమె మళ్ళీ తెలుగు వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు - తమిళ్ - మలయాళంలో తెరకెక్కుతున్న 'లాల్ బాగ్' అనే సినిమాలో మమతా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా విస్తరిస్తున్న సాఫ్ట్ వేర్ అంశాన్ని హైలెట్ గా చూపించనున్నారాట. ఇక సమ్మర్ లో ఒకేసారి తెలుగు తమిళ్ మలయాళం భాషల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X