Remuneration: విజయ్ మూవీలో మమిత బైజుకి భారీ రెమ్యునరేషన్.. ప్రేమలు బ్యూటికి పారితోషికం ఎంతో తెలుసా?
ప్రెజెంట్ మన సౌత్ ఇండియా సినిమా దగ్గర కొత్త కొత్త హీరోయిన్స్ కి ఎలాంటి కొదవ ఉండదు. తెలుగు నుంచి సహా అనేక భాషల్లో కొత్త హీరోయిన్స్ రంగంలోకి దిగుతున్నారు. కాగా ఇలా వస్తున్న కొత్త హీరోయిన్స్ లో అందరూ క్లిక్ అయ్యిపోతున్నారా అంటే అది కూడా ఉండడం లేదు. కొందరు మొదటి సినిమాతో రాణించినప్పటికీ వారికి అవకాశాలు దక్కడం లేదు.
మరికొందరికి వరుస ఆఫర్స్ అది కూడా కెరీర్ స్టార్టింగ్ లో బిగ్ స్టార్డం ఉన్న హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు కొట్టేస్తున్నారు. కాగా ఇప్పుడు ఇలాంటి అవకాశాన్ని దక్కించుకున్న యంగ్ హీరోయిన్ కోసమే మాట్లాడుకునేది.. కాగా ఈ ఏడాది మలయాళ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ 2024 లో ఫిబ్రవరి నుంచి వరుసగా మూడు నాలుగు నెలలు పలు చిత్రాలు వచ్చి సెన్సేషనల్ హిట్లు ఒకదాన్ని మించి ఒకటి భారీ వసూళ్లు సాధించి దుమ్ము లేపాయి.

కాగా అలా వచ్చిన క్రేజీ హిట్ చిత్రాల్లో యూత్ హిట్ "ప్రేమలు" కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన క్యూట్ చిక్ మమిత బైజుకి ఈ సినిమాతో ఒక్కసారిగా మంచి ఫేమ్ వచ్చేసింది. కాగా అక్కడ నుంచి తెలుగులో కూడా మమితకి మంచి ఆఫర్స్ వచ్చాయని టాక్ వచ్చింది. కానీ తెలుగు డెబ్యూ ఏమో కానీ తమిళ్ డెబ్యూ ఇచ్చేందుకు మమిత బైజు సిద్ధం అయ్యిపోయింది.
కాగా మమిత ఒక ఫీమేల్ లీడ్ గా కోలీవుడ్ తలపతి విజయ్ హీరోగా నటించనున్న తన ఆఖరు సినిమా తలపతి 69 కోసం ఎంపిక అయ్యింది. కాగా రీసెంట్ గానే సినిమా ముహూర్త కార్యక్రమాలు కూడా జరుపుకుంది. అయితే ఈ సినిమా కోసం మమిత బైజు తన శాలరీ డబుల్ చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రేమలు ముందు వరకు మమిత రెమ్యునరేషన్ గా 30 లక్షలు ఛార్జ్ చేసేదట.
కానీ ప్రేమలు ఒక్కసారి హిట్ అయ్యాక దానిని అరకోటికి మార్చేసిందట. అలా మలయాళంలో ఆమెతో సినిమా చేయాలంటే 50 లక్షలు రెమ్యునరేషన్ ఆమెకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు విజయ్ సినిమా కోసం దానిని మరింత డబుల్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో విజయ్ చివరి సినిమాకి ఆమె మొదటిసారిగా కోటి రూపాయలు అందుకుంటున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది.
ఈ సినిమా "భగవంత్ కేసరి" కి రీమేక్ అన్నట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి. కాగా ఇందులో మమిత శ్రీలీల రోల్ చేయనున్నట్టు పుకార్లు ఉన్నాయి. ఒకవేళ అదే నిజం అయితే ఇది మమిత బైజు ఛాలెంజింగ్ రోల్ అని చెప్పవచ్చు. క్రేజీ ఫైట్ సీక్వెన్స్ లు డాన్స్ లు ఇంకా ఫిజికల్ గా కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది.

సో అవన్నీ దృష్టిలో పెట్టుకొనే మమిత ఈ భారీ మొత్తం ఛార్జ్ చేస్తున్నట్టుగా వినికిడి. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











