Mamta Mohandas టాలీవుడ్ రీ ఎంట్రీ.. లాల్ బాగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు!

యమదొంగ, చింత‌కాయ‌ల ర‌వి, కింగ్ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దక్షిణాది హీరోయిన్ మ‌మ‌తామోహ‌న్ దాస్ అనారోగ్య కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరమయ్యారు. క్యాన్సర్ వ్యాధి నుంచి గట్టెక్కి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. తాజా పలు సినిమాల్లో నటిస్తూ మళ్లీ బిజీగా మారిపోయారు. 2019లో అనియన్ కంజిను తిన్నాలవయత్తు అనే మలయాళ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత తేడల్ అనే సినిమాలో నటించారు. ఈ రెండు చిత్రాలు మంచి రెస్పాన్స్ కూడా గట్టుకొన్నాయి. తాజాగా లాల్‌బాగ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 26న రిలీజ్ కానున్నది. తెలుగులో మమతా మోహన్ దాస్ రీ ఎంట్రీ ప్రమోషన్స్ విషయంలోకి వెళితే..

మమతా మోహన్‌దాస్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ బాగ్ రిలీజ్‌కు ముందే దక్షిణాదిలో మంచి ఆదరణను సంపాదించుకొన్నది. ఐటీ, థ్రిల్ల‌ర్ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మానాభ‌న్ దర్శకుడు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్‌పై రాజ్ జకారియా నిర్మిస్తున్నారు. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాహుల్‌ రాజ్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా...

 Mamta Mohandass Tollywood re entry with LalBagh

సమర్పకులు ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ థ్రిల్లర్ జోనర్‌లో విభిన్న కథా చిత్రంగా లాల్ బాగ్ సినిమా రూపొందింది. మ‌మ‌తామోహ‌న్ దాస్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌శాంత్ ముర‌ళి ప‌ద్మనాభ‌న్ అధ్బుతంగా తెరకెక్కించారు. ఈ నవంబరు 26న తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అని అన్నారు.

నటీనటులు: మ‌మ‌తామోహ‌న్ దాస్, నందిని రాయ్, సిజోయ్ వ‌ర్గిస్‌, అజిత్ కోషి
దర్శకత్వం : ప్ర‌శాంత్ ముర‌ళీ ప‌ద్మనాభ‌న్
సమర్పణ: ఏ సంపత్ కుమార్
బ్యానర్: సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్
డీవోపి: అంథోని రాజ్
సంగీతం: రాహుల్‌ రాజ్‌
ఎడిటర్: సునీష్ సెబాస్టియన్
ఆర్ట్: రాజేష్ శంకర్
పీఆర్వీ: శ్రీను - సిద్దు
రిలీజ్: 2021-11-26

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X