నయనతారపై యమదొంగ బ్యూటీ ఆరోపణలు.. అలాంటి పని చేసి దొరికిపోవడంతో ఓపెన్ కామెంట్!

రాజమౌళి యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన మలయాళీ భామ మమతా మోహన్ దాస్. ఈ బ్యూటీ మొదట మలయాళంలో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అనంతరం నటిగా, గాయనిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న మమతా మోహన్ దాస్ కెరీర్ లో కాంట్రవర్సీలు పెద్దగా ఏమి లేవు. అయితే ఆమెకు నయనతార వలన ఒకసారి ఇబ్బంది కలిగిందట. అయితే నయన్ పేరు ఎత్తకుండానే మమతా ఆ విషయాన్ని చెప్పింది. ఆ వివరాల్లోకి వెళితే..

చాలా కాలం తరువాత రీ ఎంట్రీ

చాలా కాలం తరువాత రీ ఎంట్రీ

మమతా మోహన్ దాస్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆరోగ్యంతో బయటపడిన తర్వాత మరల మాతృభాషలో హీరోయిన్ గా బిజీ అయ్యింది. ఇక చాలా కాలం తర్వాత తెలుగులో ఈ బ్యూటీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. హీరోయిన్ గా కాకుండా తన వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ వెలుతోంది. అలాగే పాడే అవకాశం వస్తే కూడా వెనక్కి తగ్గడం లేదు.

నయనతార వలన

నయనతార వలన

ఇదిలా ఉంటే తాజాగా మమతా మోహన్ దాస్ ఓ ఇంటర్వ్యూలో నయనతార మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నయనతారతో ఆమెకు ఒకసారి ఇబ్బంది ఎదురయ్యిందట. అయితే మమతా మాత్రం ఆమె పేరు చెప్పకుండా జరిగిన ఘటన గురించి బయటపెట్టింది.

ఓపెన్ కామెంట్

ఓపెన్ కామెంట్

గతంలో నయనతారపై మరో హీరోయిన్ మాళవిక మోహనన్ ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు సీనియర్ హీరోయిన్ మమతా మోహన్ దాస్ కూడా నయనతార వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కారణంగా ఒక సినిమాలో చాలా తక్కువ టైమ్ లో కనిపించినట్లు ఆమె ఓపెన్ గా వివరణ ఇచ్చింది.

 షూటింగ్ జరుగుతున్న సమయంలో

షూటింగ్ జరుగుతున్న సమయంలో

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఒక సినిమాలో సాంగ్ కోసం తనని సంప్రదించారని, నేను కూడా చేయడానికి ఒకే చెప్పి షూటింగ్ కి వెళ్లాలని ఆమె చెప్పారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో పాట చిత్రీకరణ చూసిన తర్వాత తనకి ప్రాధాన్యత లేదని అర్ధమైంది. దానికి కారణం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేయగా హీరోయిన్ గుట్టు తెలిసిందని మమతా వివరణ ఇచ్చింది.

 కండిషన్ పెట్టిందట.

కండిషన్ పెట్టిందట.


ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె దర్శక, నిర్మాతలకి పెట్టిన కండిషన్ పెట్టిందట. ఇంకో హీరోయిన్ సినిమాలో నటిస్తే తాను షూటింగ్ కి రానని ఆమె చెప్పినట్లు తన దృష్టికి వచ్చిందని మమతా మోహన్ దాస్ తెలిపింది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఒక్క ఫ్రేమ్ లో మాత్రమే కొన్ని సెకండ్స్ పాటు తాను కనిపిస్తానని తెలిపింది. ఆ సినిమా కోసం నేను కేటాయించిన నాలుగు రోజుల కాల్ షీట్స్ వేస్ట్ అయ్యానని అనిపించింది అని మమతా తెలిపింది.

 ఆ సినిమాలోనే ఇలా..

ఆ సినిమాలోనే ఇలా..

మమతా మోహన్ దాస్, నయనతార కనిపించిన ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కథానాయకుడు. అయితే మమతా మోహన్ దాస్ ఆ హీరోయిన్ పేరు బయటకు చెప్పకుండా ఇన్సిడెంట్ గురించి చెప్పడంతో ఆమె నయన్ అని అందరికి అర్ధమవుతోంది. ఇప్పుడు మమతా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై నయనతార ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X