కీర్తి సురేష్‌పై దాడి చేసిన వ్యక్తి: నడిరోడ్డు మీదే అసభ్యంగా తాకుతూ.. తలపై కొట్టడంతో!

సినిమాల్లోకి వచ్చిన కొంత మంది హీరోయిన్లు మాత్రమే సక్సెస్ అవుతున్నారు. అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు.

అందానికి అందం, నటనకు నటనతో సత్తా చాటుతోన్న ఈ సుందరాంగి.. సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. మూడు నాలుగు భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా కీర్తి సురేష్ గతంలో తనపై జరిగిన దాడి గురించి రివీల్ చేసింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరే చూడండి!

Man Misbehave and Attack On Heroine Keerthy Suresh

చిన్నప్పుడే మొదలెట్టేసి: చిన్న వయసులోనే కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసింది. ఆ తర్వాత 'గీతాంజలి' అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. అనంతరం తమిళంలోనూ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే రామ్ నటించిన 'నేను శైలజ' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. ఇది సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి.

మహానటిగా అవార్డులతో: 'నేను శైలజ' తర్వాత కీర్తి సురేష్ టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లను అందుకుంది. అలాగే, బడా స్టార్లతో భారీ సినిమాలను కూడా చేసింది. ఈ క్రమంలోనే అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' మూవీలో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసింది. ఇందులో ఆమె నటనకు దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. అంతేకాదు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

గత ఏడాది ఫుల్ బిజీగా: కీర్తి సురేష్ మొదట్లో కాస్త స్లోగానే సినిమాలు చేసినా.. స్టార్‌గా మారిన తర్వాత మాత్రం జెట్ స్పీడుతో మూవీలు చేసింది. ఇలా 2022లో వరుసగా 'గుడ్ లక్ సఖి', 'సర్కారు వారి పాట', 'వాషీ', 'సానీ కాయిదామ్' అనే సినిమాలు చేసింది. ఇక, 2023లో 'దసరా', 'నాయకుడు', 'భోళా శంకర్' వంటి చిత్రాలతో వచ్చింది. కానీ తెలుగులో పెద్దగా సక్సెస్ కాలేదు.

Man Misbehave and Attack On Heroine Keerthy Suresh

ఇప్పుడా మూవీలో క్రేజీ: సౌత్ ఇండియాలో అన్ని భాషల్లోనూ హవాను చూపిస్తోన్న కీర్తి సురేష్.. ఇప్పుడు ఈ బ్యూటీ 'సైరన్', 'రఘు తాతా', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' అనే తమిళ సినిమాల్లోనూ నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైతం కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ముఖ్యంగా 'సైరన్' మూవీలో క్రేజీ రోల్ చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన విడుదల కాబోతుంది.

దాడి జరిగిందని లీక్: 'సైరన్' మూవీ త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో కీర్తి సురేష్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో సినిమా సంబంధిత విషయాలతో పాటు తన పర్సనల్ మేటర్స్‌ను కూడా మాట్లాడింది. ఈ క్రమంలోనే గతంలో తనపై జరిగిన దాడి గురించి తొలిసారిగా కీర్తి సురేష్ బయట పెట్టింది.

Man Misbehave and Attack On Heroine Keerthy Suresh

అసభ్యంగా తాకడని: కీర్తి సురేష్ మాట్లాడుతూ 'నేను సినిమాల్లోకి రాకముందే ఓ రోజు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లా. రాత్రి సమయంలో మేమంతా రోడ్డుపై నడుస్తున్నాం. అదే సమయంలో ఓ వ్యక్తి బాగా తాగేసి అటూ వైపు నడుస్తూ వస్తున్నాడు. నా వెనకకు రాగానే నన్ను తాకూతూ ముందుకు వెళ్లాడు. కావాలనే అతడు నన్ను తాకడని అర్థమైంది. నాకు పట్టరానంత కోపం వచ్చింది' అని చెప్పింది.

దాడి చేయడంతోనే: ఆ తర్వాత కీర్తి సురేష్ కంటిన్యూ చేస్తూ.. 'నన్ను తాకగానే అతడిని పట్టుకుని చెంపపై కొట్టాను. ఆ తర్వాత అతడు కూడా నాపై దాడి చేశాడు. తలపై విపరీతంగా కొట్టాడు. నేను, నా ఫ్రెండ్స్ కలిసి అతడిని చితకబాది పోలీసులకు అప్పగించాం. వాళ్లు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆరోజు రాత్రంతా అతడిని జైలులోనే ఉంచి ఉదయాన్ని వదిలారు' అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X