RGV Vyooham వైఎస్ భారతీగా మలయాళ ముద్దుగుమ్మ.. ఎవరీ మానస రాధాకృష్ణన్ అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన కీలక సంఘటనల ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రం వ్యూహం. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో వైఎస్ జగన్‌గా అజ్మల్, వైఎస్ భారతీగా మానస రాధాకృష్ణన్ నటిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు రాంగోపాల్ వర్మ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో వైఎస్ భారతీగా నటిస్తున్న మానస రాధాకృష్ణన్ ఎవరనే ప్రశ్నలు మీడియాలో కనిపించాయి. వ్యూహం, మానసకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

గత కొద్దికాలంగా రాంగోపాల్ వర్మ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించబోతున్నాను అనే మాట పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే ఆ సినిమా జగన్ బయోపిక్ కాదు.. మరోకరి బయోపిక్ కాదు. బయోపిక్ కన్నా లోటైన రియల్ పిక్.. బయోపిక్‌లో అబద్దాలు ఉంటాయేమో.. రియల్ పిక్‌లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయి అని వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాంగోపాల్ వర్మ చెప్పినట్టుగానే వ్యూహం సినిమా ఫోటోలను రిలీజ్ సంచలనం రేపారు. అయితే వైఎస్ భారతీ ఫోటోలను ప్రత్యేకంగా రిలీజ్ చేయడంతో మరింత ఆసక్తి పెరిగింది. వైఎస్ భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ ఎంపిక చేసి.. ఆమెకు తగినట్గుగా మంచి మేకప్‌తో పోలీకలు దాదాపు కలిసేలా చేశారు. దాంతో ఎవరీ మానస.. ఎవరీ మానస రాధాకృష్ణన్ అనే ప్రశ్న అందరిని వెంటాడుతున్నది.

మానస రాధాకృష్ణన్ మలయాళ నటి. కేరళలో పుట్టి దుబాయ్‌లో పెరిగింది. 2008లో బాలనటిగా మలయాళ చిత్రం కన్నునీరినమ్ మధురం అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత బాలనటిగా కదాక్షమ్, వీళ్లై వీరన్ అనే చిత్రాల్లో నటించింది. తియాన్ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా మలయాళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
పలు మలయాళ చిత్రాల్లో నటించిన మానస రాధాకృష్ణన్ ఆ తర్వాత తెలుగులో కూడా అదృష్టాన్ని పరీక్షించుకొన్నది. ఆనంద్ దేవరకొండతో కలిసి హైవే అనే చిత్రంలో నటించింది. ప్రేక్షకులను ఆ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత తెలుగు సినిమాకు దూరంగా ఉండిపోయింది. చివరకు రాంగోపాల్ వర్మ చేతిలో పడి వ్యూహంలో చిక్కింది.


Click it and Unblock the Notifications











