పెళ్లికి ముందు అలాంటి అనుభవం అవసరం.. కపుల్ ఫ్రెండ్లీ అంటూ హీరోయిన్ మానస వారణాసి
యంగ్ హీరోయిన్ మానస వారణాసి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఫెమినా మిస్ ఇండియా టైటిల్ సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పుడు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే తెలుగులో కేవలం రెండు సినిమాలే చేసినప్పటికీ, తన రెండో చిత్రం కపుల్ ఫ్రెండ్లీతో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో మానస వారణాసి పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ మరోసారి చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏమన్నారంటే?
లివింగ్ రిలేషన్ అంశంపై హీరోయిన్ మానస వారణాసి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్‌పై ఓపెన్‌గా మాట్లాడుతూ ఆసక్తికర అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అండర్ స్టాండింగ్ ఉంటేనే ఏ రిలేషన్ అయినా? మానస మాట్లాడుతూ...'ఏ రిలేషన్‌లో అయినా అండర్‌స్టాండింగ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో లివింగ్ టుగెదర్ చాలా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్ చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు మ్యారేజ్‌కు ముందు కమ్యూనికేషన్ ఉండేది కాదు. పెళ్లయ్యాకే ఒకరినొకరు తెలుసుకునేవాళ్లు. అప్పుడు ఎన్నో కాంప్రమైజ్‌లు ఉండేవి. కానీ ఇప్పుడు లివింగ్ రిలేషన్ వల్ల ముందే ఒకరి స్వభావం, ఆలోచనలు అర్థం చేసుకునే అవకాశం వస్తోంది' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఓటీటి సబ్స్క్రిప్షన్ ఉదాహరణతో
మరో ఇంటర్వ్యూలో మానస ఈ అంశాన్ని మరింత సరదాగా వివరించారు. లివింగ్ రిలేషన్ అంటే ఏమిటో అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తూ ఓ సరదా ఉదాహరణ ఇచ్చారు. ఓ వ్యక్తితో మాట్లాడుతూ... 'మనిద్దరం లివింగ్ రిలేషన్ ట్రై చేద్దామా?'అని అడిగితే, అతడు "లివింగ్ అంటే ఏంటి?" అని ప్రశ్నించాడట. దానికి మానస "ఇది ఒక కపుల్ ఫ్రెండ్లీ రిలేషన్" అని ఇంగ్లిష్‌లో చెప్పగా, అతడు పూర్తిగా తెలుగులో వివరంగా చెప్పమని అడిగాడట. అప్పుడు మానస ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉదాహరణ తీసుకొచ్చారు.
'ఓటీటీలో ఫ్రీ ట్రయల్ మెంబర్షిప్ ఉన్నట్లే... ముందుగా ఒక నెల ట్రై చేసి చూడడం. బాగుంటే తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవడం. లివింగ్ రిలేషన్ కూడా అంతే," అని వివరించారు. ఇందుకు ప్రతిగా ఆ వ్యక్తి... 'ఫ్రీ అయిపోయాక మంత్లీ ఎంత పే చేయాలి?' అని షాకింగ్ ప్రశ్న వేయడంతో, మానస అతడి చెంప పగలగొట్టిన ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ కామెంట్స్ బయటకు రావడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంతమంది "ముందే అర్థం చేసుకునే అవకాశం రావడం మంచిదే" అంటూ మానస అభిప్రాయానికి మద్దతు తెలుపుతుంటే... మరికొందరు మాత్రం "లివింగ్ రిలేషన్ పేరుతో విలువలు తగ్గిపోతున్నాయి" అంటూ విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశం ఏటు వైపుకు దారి తీస్తుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications











