భయంకరమైన విషయాన్ని చెప్పిన మంచు లక్ష్మీ.. ఇక మూసుకొని ఉండాల్సిందే!

మంచు వారి ఫ్యామిలీలో అందరికంటే భిన్నమైన క్రేజ్ అందుకున్న వారిలో మంచు లక్ష్మి ఒకరు. నటిగానే కాకుండా నిర్మాతగా యాంకర్ గా అనేక రకాలుగా అనుభవం ఉన్న లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా గట్టిగానే ఉన్నారు. ఆమె ఎలాంటి కామెంట్ చేసినా కూడా నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి. ఇక ఇటీవల ఆమె ఒక భయంకరమైన విషయాన్ని చెప్పడమే కాకుండా ఎవరు ఊహించని విధంగా కౌంటర్ కూడా ఇచ్చింది.

Recommended Video

Manchu Lakshmi ట్వీట్ లు చూసారా.. ఓ పక్క హెచ్చరిస్తూనే..!! || Filmibeat Telugu
 ట్రోల్స్ ఎన్ని వచ్చినా

ట్రోల్స్ ఎన్ని వచ్చినా

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కాంట్రవర్సీ అయినా మంచి విషయమైనా సరే విభిన్నంగా చెప్పాలని అనుకుంటారు. అలాంటి వారిలో మంచు లక్ష్మి ఒకరు. ఆమె ఎలాంటి విషయం చెప్పినా కూడా విభిన్నమైన కామెంట్స్ వస్తుంటాయి. ఇక ట్రోల్స్ ఎన్ని వచ్చినా కూడా ఆమె లెక్క చేయదు.

ఆ రాక్షసి పాత్రకు భారీ క్రేజ్

ఆ రాక్షసి పాత్రకు భారీ క్రేజ్

మంచు లక్ష్మి నటిగా అనగనగా ఓ ధీరుడు సినిమాలో చేసిన రాక్షసి రోల్ ఏ రేంజ్ లో క్లిక్కయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినిమా కమర్షియల్ గా ఆడకపోయినప్పటికి లక్ష్మీ చేసిన ఐరేంద్రి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఇక మంచు లక్ష్మి నిర్మాతగా మారి సొంతంగా కొన్ని విభిన్నమైన సినిమాలను నిర్మించింది.

నిర్మాతగా భారీ నష్టాలు

నిర్మాతగా భారీ నష్టాలు

నేను మీకు తెలుసా, ఝుమ్మంది నాథం, ఊ కొడతారా? ఉలిక్కిపడతారా?, గుండెల్లో గోదారి, దొంగాట వంటి విభిన్నమైన సినిమాలను నిర్మించారు. కానీ ఆ సినిమాలేవి కూడా బాక్సాఫీస్ వద్ద క్లిక్కవ్వలేదు. నిర్మాతగా ఆమె భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు. ఆ తరువాత కొన్ని రియాలిటీ షోలతో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే.

కొత్త వైరస్ వ్యాపిస్తోంది

కొత్త వైరస్ వ్యాపిస్తోంది

ఇక రీసెంట్ గా కరోనా వైరస్ గురించి వివరణ ఇచ్చిన మంచు లక్ష్మి దాని వ్యాప్తి గురించి కూడా వివరణ ఇచ్చింది. కరోనా వైరస్ లో కొత్తగా వచ్చిన N440k అనేది ప్రస్తుతం ఉన్న కోవిడ్ కంటే 10రేట్లు ఎక్కువగా సంక్రమిస్తుందని తెలిపింది. ఈ కొత్త తరహా వైరస్ మొదట ఆంద్రప్రదేశ్ లోని కర్నూల్ సిటీలోనే కనుగొనబడిందట.

మూసుకొని ఇంట్లోనే కూర్చుందాం

మూసుకొని ఇంట్లోనే కూర్చుందాం

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త తరహా వైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వివరణ ఇచ్చిన మంచు లక్ష్మి విబిన్నంగా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది. మూసుకొని ఇంట్లోనే కూర్చుందాం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం బిగ్ స్క్రీన్ కు దూరంగానే ఉన్నప్పటికీ పలు వెబ్ సిరిస్ లలో నటించడానికి ఒప్పుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X