‘బొడ్డు చూపిస్తే తప్పా? అలాంటి వార్తలతో రాత్రంతా గుక్కపెట్టి ఏడ్చా..’

మంచు వారసురాలు, నటి, నిర్మాత మంచు లక్ష్మీ (Manchu Lakshmi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతుంది. ఇలాంటి ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొని, ఎప్పుడూ చూడని విధంగా అన్‌ఫిల్టర్డ్‌గా మాట్లాడింది. అన్‌ఫిల్టర్డ్‌గా మాట్లాడిన ఇంటర్వ్యూ తాజాగా ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఏమన్నారంటే?

టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల 'దీ మేల్ ఫెమినిస్ట్ ('The Male Feminist') అనే పాపులర్ పోడ్ కాస్ట్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా మంచు లక్ష్మి అన్‌ఫిల్టర్డ్‌గా చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఈ ఎపిసోడ్‌లో తన వ్యక్తిగత జీవితం,సినీ కెరీర్, భారతీయ మహిళలు ఎదుర్కొనే ప్రత్యేక ఇబ్బందులు వంటి అనేక కీలక విషయాలను స్పష్టంగా వివరించారు.

Manchu Lakshmi Goes Unfiltered Bold MeToo Talk Industry Truths on The Male Feminist

ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ మీటూ ఉద్యమంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో ఆమెను "మీరు స్టార్ కిడ్... మీకు ఎలాంటి ఇబ్బందులు రాలేదనుకుంటా?" అని ప్రశ్నించగా, లక్ష్మీ వెంటనే స్పందిస్తూ "అలా అనుకోవడం చాలా పెద్ద తప్పు. నేను కూడా అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నాను. కానీ నా కుటుంబం, నాన్న పేరు కారణంగా కొన్నివరకు దూరంగా ఉండేవి అంతే" అని చెప్పింది. మీటూ ఉద్యమం సమయంలో ఇండస్ట్రీలో బయటకు వచ్చిన ఘటనలు తన మనసును తీవ్రంగా కలచేశాయని, కొన్ని సంఘటనలు విన్నప్పుడల్లా కన్నీళ్లు ఆగలేదని తెలిపింది. "అన్నీ తెలిసిన తర్వాత... ఎన్నో రాత్రులు ఒంటరిగా ఏడ్చాను. కొన్ని కథలు నిజంగా హృదయాన్ని పిండేశాయి" అని భావోద్వేగంగా చెప్పింది.

అలాగే.. సౌత్- నార్త్ ఇండియా ఫిలిం కల్చర్ మధ్య తేడాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. తన డ్రెస్సింగ్‌పై వచ్చే విమర్శలను కూడా ఆమె తిప్పికొట్టింది."కొన్ని సన్నివేశాల్లో బొడ్డు చూపిస్తే పెద్ద తప్పు చేసినట్టేనా? ఇది ఆర్ట్. లుక్ రిక్వైర్మెంట్. కానీ మన సమాజం మహిళల శరీరాన్ని వేరేలా అంశంగా చూస్తుంది" అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. అలాగే సౌత్ ఫిల్మ్ కల్చర్, నార్త్ ఇండస్ట్రీ వర్క్ స్టైల్ మధ్య ఉండే తేడాలను వివరించింది. సౌత్‌లో ఎక్కువగా సంప్రదాయలు, మహిళలపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, నార్త్‌లో మాత్రం పనితో పనిగా వ్యవహరించే ప్రొఫెషనలిజం ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.

అలాగే.. ప్లాస్టిక్ సర్జరీపై వచ్చిన విమర్శలకు సూటి సమాధానం ఇచ్చింది. "కాస్మెటిక్ సర్జరీ చేసుకున్నా, చేయకపోయినా అది వ్యక్తిగత నిర్ణయం. మహిళలు ఇలాంటి విషయాలు చెప్పడానికే సిగ్గుపడే సమాజంలో జీవిస్తున్నాం. అలాంటి విషయాలను బ్రేక్ చేయాల్సిన సమయం వచ్చింది" అని తెలిపింది.

టాలీవుడ్ కంటే హాలీవుడ్ ఎందుకు ఈజీగా? అని ప్రశ్నించగా.. హాలీవుడ్‌లో పని చేసిన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ "అక్కడ గౌరవం, సమయపాలన, వర్క్ ప్రొఫెషనలిజం అద్భుతంగా ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీలో ఆ ఒత్తిడి, ఆ అంచనాలు మహిళలపై భారీగా ఉంటాయి. హాలీవుడ్‌లో పని చేయడం నిజంగా ఈజీగా అనిపించింది" అని తెలిపింది.

అలాగే.. అమెరికా, భారత్ లోని సెక్స్ ఎడ్యుకేషన్ మధ్య భారీ తేడాలు ఉన్నాయనీ, తన చిన్ననాటి అమెరికా అనుభవాన్ని ప్రస్తావించారు. "సెక్స్ ఎడ్యుకేషన్ అమెరికాలో స్కూల్లోనే నేర్పిస్తారు. కానీ భారత్‌లో ఇవి మాట్లాడటమే పాపం అన్నట్టుగా చూస్తారు. ఈ విషయానికి సంబంధించిన అవగాహనలో మనం చాలా వెనుకబడ్డాం" అని వ్యాఖ్యానించింది.

'The Male Feminist' ఎపిసోడ్‌లో లక్ష్మీ మంచు చెప్పిన ప్రతి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తం మీద,ఈ ఇంటర్వ్యూ మంచు లక్ష్మీ తన పర్సనల్ వ్యూను చూపించడమే కాకుండా, ఇండస్ట్రీలో ఉన్న వాస్తవాలు, సమాజంలోని మూస ధోరణలు, మహిళలు ఎదుర్కొనే సమస్యలను తెరపైకి తీసుకవచ్చారని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X