కన్నప్పలో ఎందుకు నటించలేదంటే? మంచు లక్ష్మి క్లారిటీ

టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ కూతురుగా మంచు లక్ష్మి ప్రసన్న తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటి ఆమె కెరీయర్ ప్రారంభంలో చేసిన పాత్రలు ఆడియెన్స్ ను ఎంతగానో అలరించారు. ముఖ్యంగా నెగెటివ్ రోల్స్ లో ఈమె పెర్ఫామెన్స్ కు మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే మంచు ఫ్యామిలీ నుంచి వచ్చే చిత్రాల్లో మంచు లక్ష్మి ఏదో పాత్రలో మెరుస్త ఉంటుంది. కానీ మొదటిసారిగా భారీ బడ్జెట్ తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'కన్నప్ప' చిత్రంలో మంచు లక్ష్మి లేకపోవడంతో హాట్ టాపిక్ గ్గా మారింది. దీనిపై తాజాగా ఆమె స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

మంచు లక్ష్మి తెలుగు సినిమాలు..
స్టార్ కిడ్ గా మంచు లక్ష్మి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నటిగా, ప్రొడ్యూసర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా కీలక పాత్రలు పోషించింది. ముందుగా తెలుగులో మంచు లక్ష్మి 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ చిత్రంలో నెగెటివ్ పాత్రలో మెరిసి తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించినందుకు గానూ బెస్ట్ విలన్ క్యాటగిరీలో నంది అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ఫిల్మ్ ఫెయిర్ అవార్డ్, సౌత్ ఇండియన్ ఇంటర్నెషనల్ మూవీ అవార్డ్, సంతోషం ఫిల్మ్ అవార్డ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక గుండెల్లో గోదారి, చందమామ కథలు, గుంటూరు టాకీస్, లక్ష్మి బాంబ్, పిట్ట కథలు వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతో పాటు , హిందీ, తమిళం, మలయాళం, హాలీవుడ్ లోనూ పలు ప్రాజెకట్స్ ల్లో నటించింది. నిర్మాతగా శ్రీ, నేను మీకు తెలుసా?, ఝుమ్మంది నాదం, ఊ కొడతారా, ఉలిక్కి పడతా, గుండెల్లో గోదారి, దొంగాట వంటి చిత్రాలను నిర్మించింది.

Manchu Lakshmi Prasanna about Kannappa Movie

కన్నప్పలో మంచు లక్ష్మికి ఎందుకు పాత్ర ఇవ్వలేదు?
మంచు ఫ్యామిలీ నుంచి తొలిసారిగా అత్యంత భారీ బడ్జెట్ రూ.200 కోట్లకు పైగా వెచ్చి తీసిన చిత్రం 'కన్నప్ప'. ఈ చిత్రానికి మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో మంచు లక్ష్మికి చిన్న పాత్ర కూడా ఇవ్వకపోవడం అంతా సందేహాలను రేకిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైన వెంటనే తను ముంబైకి కూడా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. అయితే దీనిపై తాజాగా మంచు లక్ష్మి స్పందించింది.

తను కన్నప్పలో నటించకపోవడానికి కారణమంటూ ఓ కారణం ఉందని చెప్పుకొచ్చారు. 'మీరు నమ్మినా నమ్మకపోయినా నాతో మా తమ్ముళ్లు సినిమా చేయాలంటే భయపడుతున్నారు. అలాగని వాళ్ల సినిమాలకు నేను వ్యతిరేకం కాదు. కన్నప్పలో నాకు వేషం ఇవ్వలేదు. నేను చేయలేదు అంతే. ప్రతి సినిమాలో వేషం దొరకాలంటే కష్టమే కాదా, పైగా ఫ్యామిలీ సినిమాలా అయిపోతుంది. అందుకే నేను తప్పుకున్నాను. మనోజ్ కు కూడా అందుకే వేషం ఇవ్వలేదు. ఆ సబ్జెక్ట్ కు తగిన నటీనటులను ఎంపిక చేశారు.' అనిచెప్పుకొచ్చింది.

ముంబైకి ఫిష్ట్ అవ్వడానికి రీజన్ ఎంటీ?
మంచు లక్ష్మి ప్రసన్న తమ్ముడు మనోజ్ పెళ్లికి ముందు నుంచే ముంబైకి వెళ్లింది. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సందడి చేస్తోంది. అక్కడ జరిగే ఈవెంట్లకు వెళ్తూ ఆకట్టుకుంటోంది. అయితే ముంబైకి వెళ్లడానికి అసలు కారణం ఏంటనేది అంతటా సందేహంగా మారింది. దానిపైనా కూడా మంచు లక్ష్మి స్పందించి క్లారిటీ ఇచ్చింది. 'కేవలం నేను నా కెరీయర్ కోసమని, మంచి పాత్రలు చేయడం కోసమని ముంబైకి షిఫ్ట్ అయ్యాను. నేను హాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు బాలీవుడ్ లో అవకాశాల కోసం చూస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి ప్రసన్న మాటలు హాట్ టాపిక్ గ్గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X