twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్షంలో అబ్బాయిలతో మంచు లక్ష్మి, రకుల్.. హాయిగా అనుకున్న పని పూర్తి చేసి..

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీమణులలో బెస్ట్ ఫ్రెండ్స్ అనే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక అందులో ఎక్కువగా హడావుడి చేసేది మాత్రం రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి. ఈ ఇద్దరు కలిశారు అంటే చాలు ఒక స్పెషల్ గోల మొదలైనట్లే. ఇక ఇటీవల ఈ ఇద్దరు కూడా ఆరుగురు అబ్బయిలతో కలిసి వర్షం పడుతున్నా లెక్క చేయకుండా అనుకున్న పనిని హాయిగా పూర్తి చేశారు.

    మంచు లక్ష్మి స్పెషల్ గ్యాంగ్

    మంచు లక్ష్మి స్పెషల్ గ్యాంగ్

    సినిమా ఇండస్ట్రీలో మంచు లక్ష్మికి స్పెషల్ గ్యాంగ్ కూడా ఉందని అప్పుడప్పుడు మీడియాలో కొన్ని కథనాలు వస్తుంటాయి. రకుల్ అనే కాకుండా రానా దగ్గుబాటి అలాగే మరికొందరు యువ హీరోలతో అప్పుడప్పుడు పార్టీలు చేసుకుంటూ ఉంటారు. కరోనా వైరస్ కారణంగా అలాంటి సంబరాలు కొంత తగ్గించినప్పటికి అప్పుడప్పుడు ఫీట్నెస్ లో భాగంగా కొన్ని టార్గెట్స్ సెట్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

     వర్షం పడుతున్నా లెక్క చేయకుండా..

    వర్షం పడుతున్నా లెక్క చేయకుండా..

    ఇక ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి ఉదయాన్నే ఒక టార్గెట్ సెట్ చెసుకొని వర్షంలో తడుస్తూనే అనుకున్న పని పూర్తి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను కూడా రకుల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. సైకిల్ రైడింగ్ తో హైదరాబాద్ నగరాన్ని హాయిగా చుట్టేశారట. వర్షం పడుతున్నా కూడా ఏ మాత్రం తగ్గకుండా దాదాపు 30కిలోమీటర్లు ప్రయాణం చేశారట.

    ఈ సారి కాస్త కొత్తగా..

    ఈ సారి కాస్త కొత్తగా..

    గతంలో కార్ రైడింగ్స్ తో ఆకట్టుకున్న లక్ష్మీ, రకుల్ ఇప్పుడు మాత్రం కొత్తగా సైకిల్స్ తో లాంగ్ రైడ్స్ చేయడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. వీరితో పాటు కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు. అందులో వారి స్నేహితులతో పాటు ఫెమస్ సైకిలిస్ట్ ఆదిత్య మెహతా అలాగే రకుల్ ప్రీత్ సింగ్ బ్రదర్ అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. వీరంతా ఫిట్ నెస్ లో భాగంగా ఉదయం హైదరాబాద్ రోడ్లల్లో సైకిల్ తొక్కుతూ కనిపించారు.

    వర్షంలో హాయిగా

    వర్షంలో హాయిగా

    వర్షంలో హాయిగా సైకిల్ తొక్కితే ఎంతో థ్రిల్లింగ్ ఉందని ఈ స్టార్స్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక వారి సినిమాల విషయానికి వస్తే.. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాతో పాటు నితిన్ కొత్త సినిమాలో నటించనుంది. ఇటీవల క్రిష్ మొదలుపెట్టిన కొత్త ప్రాజెక్టులో రకుల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు ఆమె తమ్ముడు కూడా హిరోగా ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    There are very few actresses in the Tollywood industry who are called best friends. Rakul Preet Singh and Manchu Lakshmi are the most rushed. This means that the two met is like the beginning of a special sphere. More recently, the duo, along with six other boys, have been able to get the bicycle ride done, regardless of whether it is raining or not.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X