ఇంకా రెచ్చిపోతా..ఐ డోంట్ కేర్.. ట్రోల్స్‌పై మంచు లక్ష్మీ రివర్స్ ఎటాక్
టాలీవుడ్ స్టార్ నటి మంచు లక్ష్మి (Manchu Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.మోహన్ బాబు కూతురుగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి, ఆ తర్వాత తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలు చేయడమే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై హాట్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఈ అమ్మడు ఎప్పుడూ స్పష్టంగా, సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడుతుంది. తాజాగా తనపై వచ్చే ట్రోల్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే?
మంచు లక్ష్మి 'లేచింది మహిళాలోకం' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో మంచులక్ష్మితో పాటు శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అర్జున్, కార్తిక్ దర్శకత్వంలో హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ కలిసి నిర్మించారు. మార్చి 26న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ కార్యక్రమంలో మంచు లక్ష్మి పాల్గొంది.మీడియాతో మాట్లాడుతూ..ఆమె తన వ్యక్తిగత జీవితం, ట్రోలింగ్, అలాగే "ఫైర్ బ్రాండ్" అనే ట్యాగ్‌పై ఆసక్తికరంగా స్పందించారు.

ట్రోలింగ్‌పై ఇక భయం లేదు
మీడియా ప్రతినిధి 'ఫైర్ బ్రాండ్ మంచు లక్ష్మి అని పిలవాలా? ఈ సినిమా తర్వాత సలహాలు కూడా ఇస్తారా?' అని ప్రశ్నించగా, మంచు లక్ష్మి చిరునవ్వుతో స్పందించారు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న పనులను నిర్వహించడం కూడా కష్టంగా ఉందని, కొత్తగా ఇంకో బాధ్యత తీసుకోవాలనే ఆలోచన లేదని చెప్పారు. 'ఇప్పటికే నేను చేస్తున్న పనులతో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం చాలా హ్యాపీగా, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాను. ఇంకో విషయం తీసుకోవడం ఇప్పుడైతే కష్టమే' అని ఆమె తెలిపారు.
'ఫైర్ బ్రాండ్' ట్యాగ్ అవసరం లేదు
తనకు "ఫైర్ బ్రాండ్" అనే ట్యాగ్ అవసరం లేదని మంచు లక్ష్మి స్పష్టం చేశారు. తాను కూడా సాధారణ మహిళనేనని, అందరిలానే జీవితం గడపాలని భావిస్తానని చెప్పారు. ముంబైకి వెళ్లిన తర్వాత తనలో ఆలోచన విధానం కొంత మారిందని వెల్లడించారు. 'ఇంతకుముందు మీడియాతో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడాలి, అలా ఉండాలి, లేదంటే ట్రోల్ చేస్తారు అనే భయం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ లేవు. ఇంకా రెచ్చిపోతా..ఐ డోంట్ కేర్.. ఎవరు ఏమైనా అనుకోండి... నేను ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటాను' అని ఆమె చెప్పడం విశేషం.
ట్రోల్స్‌పై కూల్ రియాక్షన్
సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ గురించి కూడా మంచు లక్ష్మి స్పందించారు. ఇప్పుడు ఆ కామెంట్లను పట్టించుకోవడం మానేశానని తెలిపారు. 'ఎవరు ఏమైనా కామెంట్ చేసినా వాటిని పట్టించుకోను. నాకు నచ్చినట్లుగా జీవించడం నేర్చుకున్నాను. అందుకే ఇప్పుడు నేను చాలా రిలాక్స్‌గా ఉన్నాను' అని ఆమె అన్నారు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం తన కుటుంబమని మంచు లక్ష్మి స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లి పాత్ర తనకు చాలా ముఖ్యమని చెప్పారు. 'ముందు నేను ఒక బిడ్డకు తల్లి. ఉదయం లేచి నా పాపను చూసుకోవడం నా బాధ్యత. ముందు ఒక తల్లిగా నా బాధ్యతలను నిర్వర్తించాలి' అని ఆమె తెలిపారు.
సినిమా ఇండస్ట్రీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని కూడా మంచు లక్ష్మి చెప్పారు. 'నేను ఇండస్ట్రీ పాపని. ఇక్కడ ఎన్నో చూశాను, ఇంకా చూస్తున్నాను. అందరితో కలిసి ఉండాలని నా ఫీలింగ్,' అంటూ ఆమె చెప్పారు. మొత్తానికి మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రోలింగ్‌ను పట్టించుకోకుండా తనకు నచ్చినట్లుగా జీవించాలని చెప్పిన ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. మంచు లక్ష్మి చేసిన ఈ కామెంట్స్‌పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేసి తెలియజేయండి.


Click it and Unblock the Notifications











