twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: ఆ వయసులో మంచు లక్ష్మి చేసిన తుంటరి పనులు!

    |

    Recommended Video

    హాట్ టాపిక్: ఆ వయసులో మంచు లక్ష్మి చేసిన తుంటరి పనులు!

    ప్రతి ఒక్కరి జీవితంలో కాలేజీ రోజులు ఎప్పటికీ మరిచిపోలేని తీపిగుర్తులుగా మిగిలిపోతాయి. ఇంట్లో తెలియకుండా సినిమాలకు వెళ్లడాలు, కాలేజీ బంక్ కొట్టడాలు ఇలా ప్రతి ఒక్కరూ తుంటరి పనులు చేసే ఉంటారు. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆ రోజులను గుర్తు చేసుకుంటే అప్పుడు మనం చేసిన పనులు నవ్వు తెప్పిస్తుంటాయి.

    టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా ఒకప్పుడు ఇలాంటి తుంటరి పనులు చేశారట. ఈ విషయాలను ఆమె గుర్తు చేసుకుంటూ ఆమో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

    నినన రాత్రి వర్షం ఎఫెక్ట్

    నినన రాత్రి వర్షం ఎఫెక్ట్

    గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు హైదరాబాద్‌లో భారీగా వర్షం పడిన సంగతి తెలిసిందే. టీనేజ్‌లో ఉన్నపుడు ఇలా వర్షం పడ్డపుడు తాను ఏం చేసేదాన్నో తెలుపుతూ తన స్వీట్ మెమొరీస్ గుర్తు చేసుకున్నారు లక్ష్మి.

    కాలేజ్ బంక్ కొట్టి సీక్రెట్ లేక్ వద్దకు వెళ్లి

    కాలేజ్ బంక్ కొట్టి సీక్రెట్ లేక్ వద్దకు వెళ్లి

    ఆ రోజుల్లో వర్షం పడితే కాలేజ్ బంక్ కొట్టి బంజారా దర్బార్‌లో బిర్యానీ తీసుకుని సీక్రెట్ లేక్(దుర్గం చెరువు) వద్దకు వెళ్లి అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్లపైకి ఎక్కి తినేవాళ్లం. ఈ రోజు ఉదయం డోర్ తెరవగానే వాతావరణం చూసి ఆ రోజులు గుర్తొచ్చాయి అని మంచు లక్ష్మి తెలిపారు.

    ‘నిలదీసిఫై’ అంటూ ఫన్నీ రిప్లై

    నేను కాలేజ్ బంక్ కొడితే మా పాదర్ ‘నిలదిసీఫై' మి... అంటూ కొందరు ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఈ ‘నిలదీసిఫై' ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు ఈ వీడియో చూడాల్సిందే.

    మంచు లక్ష్మి మూవీస్

    మంచు లక్ష్మి మూవీస్

    మంచు లక్ష్మి సినిమాల విషయానికొస్తే.... ‘వైఫ్ ఆఫ్ రామ్' చిత్రం విడుదలైంది. దీంతో పాటు తమిళంలో జ్యోతిక మూవీ ‘కాత్రిన్ మోళి' చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

    English summary
    "This is the weather that got me into so much trouble growing up... bunk college, pick up banjara darbar biryani climb the rocks of secret lake(durgama cheruvu) and eat..so many memories flashed this morning when I opened my door..what r ur childhood memories?" Manchu Lakshmi tweeted.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X