ఆ నలుగురే.. థియేటర్లను శాసిస్తున్నారు, మోహన్ బాబు కూతురైనా పీకేస్తున్నారు: మంచు లక్ష్మి

Recommended Video

Lakshmi Manchu Debut On Digital Platform | Filmibeat Telugu

హాలిడే సీజన్, లేదా పండగ సీజన్ వచ్చిందంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో థియేటర్ల వార్ మొదలవుతుంది. ఆ నలుగురే థియేటర్లను శాసిస్తున్నారు, చిన్న సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా చిధిమేస్తున్నారు, బాగా ఆడే సినిమాలను కూడా థియేటర్ల నుంచి పీకేసి ఇబ్బంది పెడుతున్నారు అనే విమర్శలు తెరపైకి వస్తాయి.

తెలుగు నిర్మాత, ప్రముఖ నటి మంచు లక్ష్మీ కూడా తాజాగా 'ఆ నలుగురు..' టాపిక్ లేవనెత్తారు. ఆమె నటిస్తున్న 'మిసెస్ సుబ్బలక్ష్మి' అనే వెబ్ సిరీస్ లాంచింగ్ ఈవెంటులో మంచు లక్ష్మి ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాలు తీయాలంటే భయం వేస్తోంది

సినిమాలు తీయాలంటే భయం వేస్తోంది

ఒక నిర్మాతగా ఇపుడు సినిమాలు తీయాలంటే భయం వేస్తోంది. సినిమా తీసినంత సేపు బావుంటుంది. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లే సమయంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. థియేటర్ల కంట్రోల్ మన చేతుల్లో ఉండదు, ఎన్ని రోజులు సినిమా థియేటర్లో ఉంటుందో తెలియని అయోమయ స్థితి ఉందని, అందుకే సినిమాలు తీయాలంటే భయం వేస్తోందని మంచు లక్ష్మి అన్నారు.

రక్తం ధార పోస్తాం.. అలా చేస్తే బాధేస్తుంది

రక్తం ధార పోస్తాం.. అలా చేస్తే బాధేస్తుంది

ఒక సినిమా తీయడానికి సంవత్సరం పాటు రాత్రింభవళ్లు కష్టపడి రక్తందారపోసి ఫ్యామిలీని కూడా వదిలేసి కష్టపడతాం. నేనే కాదు నాతో పాటు పని చేసే 150 మంది అలాగే కష్టపడతారు. రిలీజైన తర్వాత ఏదో సినిమా వస్తుందని మా సినిమా పీకేయడాలు జరిగినపుడు చాలా బాధ పడ్డాను... అని లక్ష్మి తెలిపారు.

వారి చేతుల్లోనే థియేటర్లు... మోహన్ బాబు కూతురు అని చూడరు

వారి చేతుల్లోనే థియేటర్లు... మోహన్ బాబు కూతురు అని చూడరు

‘‘ఐదారు మంది చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి. పెద్ద చిన్న అని చూడరు. వారిని వెళ్లి అడిగే అవకాశం కూడా ఉండు. మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్లో ఉంచుదాం... లాంటివి ఏమీ జరుగదు'' అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు.

కథలతో ప్రయోగాలు చేయడానికి చాలా ఫ్రీడం ఉంటుంది

కథలతో ప్రయోగాలు చేయడానికి చాలా ఫ్రీడం ఉంటుంది

వెబ్ సిరీస్ వైపు రావడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. టెలివిజన్, సినిమా, వెబ్ సిరీస్ ఏదైనా నాకు కంటెంట్ ముఖ్యం. వెబ్ సిరీస్ కదా అని తక్కువ స్థాయిలో చేయలేదు. దీనికి పని చేసిన అందరిలో విషయం ఉంది, పాషన్ ఉంది. అందుకే కలిసి ఈ వెబ్ సిరీస్ కోసం పని చేశాం. వెబ్ సిరీస్ అనేది ఒక మంచి ఫ్లాట్ పాం. కథలతో ప్రయోగాలు చేయడానికి చాలా ఫ్రీడం ఉంటుందన్నారు.

భవిష్యత్తులో వీటి హవా నడుస్తుంది

భవిష్యత్తులో వీటి హవా నడుస్తుంది

థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇపుడు ఇంట్లో కూడా అదే క్వాలిటీతో ఇచ్చే పరిస్థితులు వచ్చాయి. చాలా మంది కొత్త సినిమాలు నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్‌లో వస్తాయని ఎదురు చూస్తున్నారు. వెబ్ సిరీస్‌లకు మంచి ఫ్యూచర్ ఉంది... అని మంచు లక్ష్మి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X