Manchu Lakshmi: నిహారికకు అసలు ఏం తక్కువ.. మేము కూడా ఆ స్థాయిలో ఉండేవాళ్ళమే..
మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన బ్యూటీ మంచు లక్ష్మి. హోస్ట్ గా, నటిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని మంచు లక్ష్మి క్రియేట్ చేసుకున్నారు. టాలీవుడ్ లో చాలా సినిమాలలో ఆమె లీడ్ యాక్టర్ గా నటించారు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఆమె గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఊహించని కామెంట్స్ తో హాట్ టాపిక్ గా మారే మంచు లక్ష్మి ఇటీవల స్టన్ అయ్యేలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిహారిక పేరు కూడా వైరల్ అవుతున్న సమయంలో మంచు లక్ష్మి ఆ విధంగా రియాక్ట్ అవ్వడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ వివరాల్లోకి వెకితే..
నేను హాలీవుడ్ యాక్టర్ ని.:ప్రస్తుతం అయితే మంచు లక్ష్మి చేతిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏవీ లేవు. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా మంచు లక్ష్మి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నేను హాలీవుడ్ యాక్టర్ ని. అక్కడ చాలా సినిమాలు చేశాను. ఇప్పటికి హాలీవుడ్ లో ఉండుంటే కచ్చితంగా టాప్ స్టార్ అయ్యేదానని వివరించారు.

నాకు ఫ్రీడమ్ వచ్చేసింది:అయితే పెళ్లి తర్వాత పిల్లలు కావాలని అనుకునే సమయంలో ఫ్యామిలీతో ఉంటే మంచిదని ఇండియా వచ్చేశాను. ప్రస్తుతం పాపకి తొమ్మిదేళ్ళు వచ్చాయి. నాకు ఫ్రీడమ్ వచ్చేసింది. ఎక్కడికైనా ఎగిరిపోగాలను. మళ్ళీ అదృష్టం ఉండి హాలీవుడ్ లో అవకాశం వస్తే వెంటనే వెళ్ళిపోతా. ఇక్కడ ఎంత చేసిన గుర్తింపు ఉండదు. మన తెలుగు దర్శక, నిర్మాతలకి పక్క రాష్ట్రాల అమ్మాయిలే కావాలి అని ఆమె తెలియజేశారు.
పక్క రాష్ట్రాల అమ్మాయిలే కావాలి:ఆడియన్స్ కూడా ఎక్కడినుంచో వచ్చిన వారినే ప్రేమిస్తారు. మన ఇంట్లో, ఊరిలో ఉండే అమ్మాయిని ఒక్కశాతం ప్రేమించి ప్రోత్సహించిన టాప్ లో ఉండేవారు. మనకంతా పక్క రాష్ట్రాల అమ్మాయిలే కావాలి. తెలుగమ్మాయిలు తెలుగు సినిమాలు చూసేవారికి నచ్చడం లేదు అని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు.

నిహారిక, బిందుమాధవి..:మధుశాలిని, బిందుమాధవి, నిహారిక, శివాని లాంటి తెలుగమ్మాయిలు టాలీవుడ్ లో ఉన్నారు. కాని వీరు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. అవకాశాలు కూడా ఇవ్వరూ ఇవ్వడం లేదు. మన వాళ్ళకి పక్క రాష్ట్రాల అమ్మాయిలు అంటేనే ఇష్టం. వారిని చూడటానికి ఇష్టపడతారు. అందుకే వీరికి అవకాశాలు రావడం లేదని ఆమె అన్నారు.

ఆడియన్స్ మైండ్ సెట్ మారితేనే..:నేను ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగమ్మాయిలకి అవకాశం ఇద్దామా అంటే నన్ను చూడటానికే దిక్కులేదు. ఇంకా వారందరిని పెట్టుకొని ప్రోత్సహించిన నష్టపోవడం తప్ప ఏమీ ఉండదు. ఆడియన్స్ మైండ్ సెట్ మారితేనే మాలాంటి వారికి అవకాశాలు వస్తాయంటూ మంచు లక్ష్మి తన ఆవేదనని పంచుకుంది. మంచు లక్ష్మి మాటల్లో వాస్తవం ఉంది. ఆమె ఆవేదనకి అర్ధం ఉంది. నిహారిక గురించి తన మాటల్లో ప్రస్తావించడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











