బ్యూటిఫుల్ ఫైట్: తెలంగాణ ఫలితాలపై మంచు లక్ష్మి
తెలంగాణ శాశన సభ ఎన్నికల ఫలితాలపై మంచు లక్ష్మి స్పందించారు. మంత్రి కేటీఆర్‌తో ముందు నుంచి మంచి స్నేహ బంధం కొనసాగిస్తున్న ఆమె.... ఓట్ల కౌంటింగ్ మొదలు కాకముందు నుంచే టీఆర్ఎస్ విజయంపై ధీమాగా ఉన్నారు.
కౌటింగ్ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు గెలుపుకు సంకేతంగా కేటీఆర్ తన ప్రొఫైల్ పిక్ మార్చగా... మంచు లక్ష్మి లైక్ చేసిన వియషం తెలిసిందే. కౌటింగ్ మొదలైన మరుసటి క్షణం నుంచే టీఆర్ఎస్ పార్టీ దూకుడుగా దూసుకెళుతుండటంతో మరోసారి అధికారం ఖాయమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మి ఆసక్తికర ట్వీట్ చేశారు.

బ్యూటిఫుల్ ఫైట్
ఒక పార్టీ... అన్ని పార్టీలతో ఎంతో అందంగా ఫైట్ చేసింది. రాష్ట్రంలో అనేక అంశాలలో ఒక అందమైన మార్పును తీసుకొచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చింది. వారికి నా అభినందనలు... అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.

మరో ఐదేళ్లు అభ్యున్నతి
రాబోయే ఐదేళ్లు తెలంగాణ రాష్ట్రంలో మరింత అభ్యున్నతి, అభివృద్ధి జరిగేలా అధికారి పార్టీ చేస్తుందని నమ్ముతున్నట్లు మంచు లక్ష్మి పేర్కొన్నారు.
మంచు మనోజ్ ట్వీట్స్
తెలంగాణ రాష్ట్ర సమితి మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.... కంగ్రాట్స్ తెలియజేస్తూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.
మా ఇండస్ట్రీ అంకుల్
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ మరోసారి విజయం సాధించిన నేపథ్యంలో.... మంచు మనోజ్ అభినందనలు తెలిజేశారు. మా సినిమా ఇండస్ట్రీ అంకుల్ మరోసారి మా ఇండస్ట్రీకి మేలు చేస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











