మంచు విష్ణు లవ్ మ్యారేజ్.. ఆమెను కోడలిగా మోహన్ బాబు ఒప్పుకోలేదు

మంచు మోహన్ బాబు.... టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా, డైలాగ్ కింగ్ గా ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. అప్పటి సమాజ పరిస్థితులను తన చిత్రాల ద్వారా అద్దం పట్టినట్టు చూపించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు విభిన్నపాత్రలు పోషించి ఇండస్ట్రీలో తనదైన ముద్రను వేసుకున్నారు. తన డైలాగ్స్, సినిమా కలెక్షన్లు కూడా ఇతర హీరోలను బీట్ చేసేలా ఉండేవి. ఇక సినిమాల పరంగా ఆయన ఎంతటి క్రమశిక్షణతో ఉంటారో.. నిజ జీవితంలోనూ అంతటి డిసిప్లైన్ ను కలిగి ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు అని సినీ ప్రముఖులే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో ఉన్న ప్రముఖులతో పాటు రాజకీయాల నాయకులతో ఆయన మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆయనకంటూ ప్రత్యేక గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. అయితే మోహన్ బాబు ఇంట్లో ఎలాంటి విషయమైన ఆయన నిర్ణయంతోనే జరగాల్సి ఉంటుంది. అన్నింటా పర్ఫెక్షన్ కోరుకుంటూ ఉంటారు. తన కొడుకులు మంచు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మిని కూడా ఎంతో పద్ధతిగా పెంచారో మనకు తెలిసిందే.

Manchu Viranica about her Love Marriage with Manchu Vishnu

అయితే.. అలాంటి మోహన్ బాబుకు మంచు విష్ణు విషయంలో కోపం తెప్పించారంట. మంచు విష్ణు పెళ్లికి ఓవైపు తండ్రి మోహన్ బాబు ఏర్పాట్లు చేస్తూ ఉంటే.. విరానికను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు తనయుడు ప్రయత్నించాడంట. అయితే తండ్రి మాటను కాదని ఏపనిచేయని మంచు విష్ణు తన పెళ్లికోసం కొన్నాళ్లపాటు వేచి ఉన్నారంట. అమెరికాలో పుట్టిపెరిగిన విరానికను ప్రేమించిన విషయాన్ని తండ్రి మోహన్ బాబుకు చెప్పడానికి ఎంతో భయపడ్డాడంట. కానీ చివరికి చేపేశాడంట.

అయితే, అదే సమయంలో విరానిక మంచు విష్ణును పెళ్లి చేసుకునేందుకు మోహన్ బాబును ఒప్పించేందుకు నానా పాట్లు పడిందంట. అసలే సంప్రదాయాలకు విలువనిచ్చే మోహన్ బాబు తమ పెళ్లికి ఒప్పుకుంటారో లేదోనని విరానిక భయపడిందంట. లేటెస్ట్ ఇంటర్వ్యూలో తన పెళ్లికి ముందు జరిగిన విషయాలను చెప్పుకొచ్చింది. మంచు విష్ణుతో తనది లవ్ మ్యారేజ్ అని చెప్పింది. కానీ తమ పెళ్లికి చాలా ఫైట్ చేయాల్సి వచ్చిందన్నారు. మామ మోహన్ బాబును అస్సలు ఒప్పుకోకపోవడంతో ఎంతో ప్రయత్నం చేయాల్సి వచ్చిందని చెప్పింది.

విరానిక అమెరికన్ కావడంతో ఆమె మంచు ఫ్యామిలీ ఎలా ఉంటుందోనని, పైగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారి వివాహ బంధం ఎలా ఉంటుందోననే సందేహం మామ మోహన్ బాబులో ఉన్నాయని చెప్పుకొచ్చింది. అవన్నీ పోగొట్టేందుకు ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులను కలిసి మోహన్ బాబుకు నచ్చజెప్పించే ప్రయత్నం చేశారంట. అన్ని విషయాల్లో మోహన్ బాబుకు అంగీకారం చెప్పిన తర్వాతే పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పింది విరానిక. మోహన్ బాబు తనను ఒక ఫ్రెండ్ లానే చూసుకుంటాడని, అన్నింటా మాట్లాడేందుకు ఫ్రీడమ్ ఇస్తుంటారని చెప్పింది. ఇంటికి పెద్దకోడలిగా తన పట్ల సంతోషంగా ఉన్నారని విరానిక చెప్పుకొచ్చింది. ఇక విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X