చేతిలో మందు గ్లాసు.. బాత్రూమ్‌లో ఆ ముగ్గురితో పాయల్ రాజ్‌పుత్ జల్సా.. వీడియో వైరల్!
చూపు తిప్పుకోకుండా చేసే అందం, అదిరిపోయే నటనతో తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఆరంభంలోనే బోల్డ్ కంటెంట్ మూవీలో నటించిన ఈ భామ.. సెన్సేషన్ అయిపోయింది.
అయితే, ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్‌లను అందుకోలేకపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం మంచి ఫామ్‌లోకి వచ్చి వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా పాయల్ రాజ్‌పుత్ తన ఫ్రెండ్‌తో కలిసి మందేస్తూ తీసుకున్న వీడియో వదిలింది. దానిపై మీరే లుక్కేయండి మరి!

సెన్సేషన్.. ఎన్నో మూవీలు
RX100 మూవీతో పాయల్ రాజ్‌పుత్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో బోల్డుగా కనిపించిన ఈ భామ.. సెన్సేషన్‌గా మారిపోయింది. ఫలితంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'ఎన్టీఆర్ కథానాయకుడు', 'RDX లవ్', 'వెంకీ మామ', 'డిస్కో రాజా', 'అనగనగా ఓ అతిథి', 'త్రీ రోజెస్' వంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

డిజాస్టర్లు వచ్చినా ఆఫర్లు
సినిమాల్లోకి ఎంటరైనప్పటి నుంచి ఏకధాటిగా ఆఫర్లను అందుకుంటూ వచ్చిన పాయల్ రాజ్‌పుత్ హిట్లను మాత్రం దక్కించుకోలేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్‌తో 'తీస్‌మార్ ఖాన్', మంచు విష్ణుతో 'జిన్నా' మూవీలు చేసింది. ఈ రెండు చిత్రాలు డిజాస్టర్లు అయ్యాయి. దీంతో పాయల్‌కు తెలుగులో ఆఫర్లు సన్నగిల్లిన విషయం తెలిసిందే.

మంగళవారంతో ఫామ్‌లో
చాలా కాలంగా హిట్ లేకపోయినా పాయల్ రాజ్‌పుత్ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. ఈ పరిస్థితుల్లో RX100తో గ్రాండ్ ఎంట్రీని అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో 'మంగళవారం' అనే మూవీ చేసింది. ఈ చిత్రం మంచి కలెక్షన్లతో సత్తా చాటింది. ముఖ్యంగా ఇందులో పాయల్ రాజ్‌పుత్ అదిరిపోయే యాక్టింగ్‌తో అలరించింది. తద్వారా తిరిగి ఫామ్‌లోకి వచ్చేసింది.
ఇప్పుడవే.. ప్రియుడితో
'మంగళవారం' మూవీతో ఫామ్‌లోకి వచ్చినా పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ఈ అమ్మడు తమిళంలో 'ఏంజిల్', 'గోల్‌మాల్' అనే సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. అలాగే, ఆమె కొంత కాలంగా పంజాబీ నటుడు సౌరభ్ డింగ్రాతో ప్రేమాయణం సాగిస్తూ పర్సనల్ లైఫ్‌ను కూడా పాయల్ తెగ ఎంజాయ్ చేసేస్తోంది.

అందులో యమ యాక్టివ్
హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచే వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పాయల్ రాజ్‌పుత్.. సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, పర్సనల్ లైఫ్ విశేషాలను సైతం షేర్ చేసుకుంటూ క్రేజ్‌ను పెంచుకుంటోంది.
మందేసి పాయల్ జల్సా
పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో హల్చల్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ క్రేజీ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ బోల్డ్ హీరోయిన్ బాత్రూంలో టబ్‌లో కూర్చుని కనిపించింది. అంతేకాదు, చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని, మరికొందరు స్నేహితులతో కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసేసింది.
పాయల్‌పై విమర్శలతో
బోల్డు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. ఎక్కువ శాతం మంది ఆమెను ఘోరమైన పదజాలంతో తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మాత్రం పాయల్‌పై అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











