75 కేజీల మగాడు నాపైన పడుకుని .. ఓర్చుకోవాల్సిందే , మంగళవారం నటి బోల్డ్ కామెంట్స్

సినిమాలలో కథ డిమాండ్ చేసిన మేరకు హీరో హీరోయిన్లు, ఇతర నటుల మధ్య బెడ్ రూం సీన్లు, లిప్ లాక్ వంటి సన్నివేశాలు తీస్తుంటారు. అయితే ఇది అనుకున్నంత తేలిక కాదు. చూసేవాళ్లే కొన్నిసార్లు ఇబ్బంది పడతారు .. అలాంటిది యాక్ట్ చేసేవాళ్లు ఇంకేలా ఉంటారో చెప్పనక్కర్లేదు. ఇబ్బండి పడినా, ఎవరు ఏమనుకున్నా బోల్డ్ సీన్స్‌లో నటించాల్సిందే . ఈ నేపథ్యంలో బెడ్ రూం సీన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంగళవారం మూవీ ఫేమ్ దివ్య పిళ్లై.

యూఏఈలో స్థిరపడిన మలయాళీ కుటుంబంలో జన్మించారు దివ్యా పిళ్లై. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి ముందు ఎయిర్‌లైన్స్‌లో పనిచేశారు. 2015లో అయల్ జనల్లా అనే మలయాళీ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టారు. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు వేయించుకున్న దివ్య.. అనంతరం తమిళ చిత్రాలతో బిజీ అయ్యారు. నవీన్ చంద్ర హీరోగా వచ్చిన తగ్గేదే లే మూవీతో తెలుగువారిని పలకరించిన దివ్య కెరీర్‌ను మంగళవారం మూవీ మలుపు తిప్పింది.

Mangalavaram Fame Divya Pillai made sensational comments on romantic scenes

ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌ను మించి మార్కులు కొట్టేశారు దివ్య. జమీందర్ భార్య రాజేశ్వరీ దేవిగా అందంగా, పద్ధతిగా.. గ్రామ ప్రజలకు పెద్దగా చేతులెత్తి మొక్కించుకుంటుంది. చివరికి క్లైమాక్స్‌లో ఆడియన్స్‌కి షాక్ ఇస్తుంది. తన అక్రమ సంబంధం బయటపడకుండా హీరోయిన్‌ని చంపేసి విలనిజాన్ని చూపెట్టి భయపెట్టారు దివ్య పిళ్లై.

మంగళవారం మూవీ దివ్య కెరీర్‌ను మార్చేసింది. ఆమెకు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య - సాయి పల్లవి నటిస్తున్న తండేల్‌లో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇది నాగచైతన్య కెరీర్‌లో తొలి పాన్ ఇండియా సినిమా. వీటితో పాటు తమిళ్‌లో బజూకా, ఏస్ అనే సినిమాల్లో దివ్య నటిస్తున్నారు.

ఇదిలాఉండగా మంగళవారం సినిమాలో దివ్య బెడ్ రూం సీన్స్‌లో నటించారు. ఓ ఇంటర్వ్యూలో ఈ బోల్డ్ సీన్స్‌పై ఇంటర్వ్యూలో ఆమెను యాంకర్ ప్రశ్నించారు. దీనికి దివ్య తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. సెట్స్‌లో అందరి ముందు శృంగార సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదని.. 75 కేజీల బరువు ఉన్న వ్యక్తి మనపై పడుకున్నా ఏమాత్రం ఇబ్బంది లేకుండా నటించాలని దివ్య చెప్పారు. ఎంత ఇబ్బంది పడినా ఓపిగ్గా భరించాల్సిందే తప్పించి ముఖంలో ఆ ఫీలింగ్‌ను అస్సలు చూపించకూడదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దివ్య పిళ్లై వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: divya pillai movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X