థాయ్ బీచ్‌లో అందాల ఆరబోత... రూబీ కలర్ బికినీలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ రైడింగ్
అందం , అభినయం ఉన్నప్పటికీ కొందరు హీరోయిన్లు ఎందుకో సక్సెస్ కాలేకపోతున్నారు. కారణం తెలియదు కానీ పెద్దవాళ్లు చెప్పినట్లు అదృష్టం కూడా తోడైతేనే ఎక్కడైనా రాణించగలరు. ఇందుకు ఎవరూ అతీతం కాదు. ఇదే కోవలోకి వస్తారు పాయల్ రాజ్‌పుత్. ఆమె నటన ఫిగర్ చూసి ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు. పైగా అందాల ఆరబోతకు ఎప్పుడూ నో చెప్పకపోవడం అడ్వాంటేజ్ . ఇన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ పాయల్‌కు ఎందుకో అవకాశాలు రావడం లేదు.
ఆర్ఎక్స్ 100 ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పాయల్ రాజ్‌పత్ అందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటించారు. అందులోని ఆమె రోల్ ఇందూ చాలా కాలం పాటు మారుమోగింది. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడు, సీత, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా, అనగనగా ఒక అతిథి, తీస్‌మార్ ఖాన్, మాయాపేటిక, మంగళవారం, రక్షణ వంటి సినిమాల్లో నటించారు. కానీ ఎందుకో ఆమెకు స్టార్ డమ్ దక్కలేదు.

మంగళవారంలో పాయల్ రాజ్‌పుత్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. పైగా అందులో బోల్డ్ సీన్స్‌లోనూ నటించింది. ఆ సినిమా ప్రమోషన్స్ సమయంలో తన స్కూల్ డేస్ నాటి అనుభవాలను పంచుకుంది. చిన్నప్పుడు ఓ అబ్బాయిని పిచ్చి పిచ్చిగా ప్రేమించానని.. అతనిని చూడగానే తనలో ఏదో తెలియని ఆనందం కలిగిందని, దాన్నే ప్రేమగా భావించానని , టెన్త్ క్లాస్ పూర్తవుతున్న చివరి రోజుల్లో తన ప్రేమ విషయాన్ని అతనికి తెలియజేశానని పాయల్ తెలిపింది. కానీ ఆ వ్యక్తి తన ప్రేమను రిజెక్ట్ చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
మంగళవారం సినిమా కోసం అనారోగ్యంతో బాధపడుతూనే నటించిందట పాయల్. ఆ సమయంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డానని.. జీవితంలో అతికష్టంగా గడిచిన క్షణాలు అవేనంటూ పాయల్ ఎమోషనల్ అయ్యారు. వాటర్ తక్కువగా తాగడం వల్లే తనకు కిడ్నీ ఫంక్షనింగ్‌లో ఇబ్బందులు వచ్చాయని.. అందుచేత వీలైనంత వరకు నీటిని ఎక్కువగా తాగాలని పాయల్ హెల్త్ టిప్స్ కూడా ఇచ్చారు.
మొన్నామధ్య పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పాయల్ రాజ్‌పుత్ పెళ్లైందంటూ అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. దీంతో ఆమె స్వయంగా స్పందించారు. ఈ రూమర్స్‌ని చూసి తాను బాగా నవ్వుకున్నానని.. ఆ వార్తలు నిజమైతే బాగుండు అనుకున్నానని పాయల్ తేల్చిచెప్పేశారు. తనకు ప్రభాస్ అంటే ఎంతో ఇష్టమని , అవకాశం వస్తే ఆయనతో కలిసి నటిస్తానని ఎన్నోసార్లు పాయల్ తెలిపారు.
ఇదిలాఉండగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడూ తన కొత్త సినిమా సంగతులు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. దీనిలో భాగంగానే ఇటీవల థాయ్ వెకేషన్‌కు వెళ్లిన ఆమె రూబీ కలర్ బికినీలో బీచ్‌లో అందాల ప్రదర్శన చేశారు. ప్రస్తుతం పాయల్ ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











