రజనీకాంత్ వల్లే నా కెరీయర్ నాశనం.. స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
నేపాలీ ముద్దుగుమ్మ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాల దేశ వ్యాప్తంగా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్ తో పాటు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ స్టార్ దర్శకులు, స్టార్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. ఆమె కెరీయర్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. 1989 నుంచి ఇప్పటి వరకు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో మాత్రం పూర్తిగా కనుమరుగై పోయింది. అందుకు కారణం సూపర్ స్టార్ రజనీకాంత్ అని మనీషా కోయిరాల ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇంతకీ రజనీకాంత్ వల్ల ఆమె సౌత్ కెరీర్ కు ఎలా దెబ్బ పడిందనే వివరాల్లోకి వెళితే..
మనీషా కోయిరాల గుర్తుండిపోయే చిత్రాలు..
హిందీతో పాటు తమిళ చిత్రాల్లో మనీషా కోయిరాల ఎక్కువగా నటించింది. తమిళంలో మూడు, నాలుగు చిత్రాల్లోనే నటించినా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. తమిళంలో ఆమె సినిమాలు భారీ బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. మణిరత్నం దర్శకత్వం వహించిన 'బాంబే', ఎస్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఇండియన్', 'ఒక్కడు' వంటి చిత్రాల్లో నటించి సంచలనంగా మారింది. దక్షిణాది ఆడియెన్స్ కు ఎంతో దగ్గరైంది. ప్రస్తుతం కుబేరాతో థియేటర్లలోకి వచ్చిన ధనుష్ సరనన కూడా 'మప్పిల్లై' చిత్రంలోనూ నటించి మెప్పించింది. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'బాబా' చిత్రంలో నటించింది. ఈ చిత్రం 2002లో విడుదలైంది.

రజనీకాంత్ పై మనీషా కోయిరాల సంచలన వ్యాఖ్యలు..
మనీషా కోయిరాల హీరోయిన్ గా మారిన తర్వాత హిందీలో చాలా సినిమాలు చేసింది.ఆమె కెరీయర్ బిగినింగ్ లో అక్కడ పెద్దగా సినిమాలు హిట్ కాలేదు. ఆమెకు స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చిపెట్టింది మాత్రం సౌత్ సినిమాలే. అలాంటిది మనీషా కోయిరాల ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన పోవడానికి కారణం రజనీకాంత్ సరసన నటించిన బాబా చిత్రమని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. బాబా చిత్రం 20 కింద విడుదలై ఫ్లాఫ్ అయ్యిందని, దాంతో ఆమె చాలా నష్టపోయిందని చెప్పింది. ఆ చిత్రం డిజాస్టర్ తర్వాత సౌత్ లో ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయానని, అంతకు ముందు మాత్రం భారీగా దక్షిణాది నుంచి సినిమా ఆఫర్లు వచ్చేవని తెలిపింది.
ఎంపీ కూతురు మనీషా కోయిరాల..
మనీషా కోయిరాల నేపాలీలోని బిరత్ నగర్ లో పుట్టి పెరిగింది. 1970 ఆగస్టు 16న జన్మించింది. ఆమె తండ్రి నేపాలీ పొలిటిషన్ ప్రకాష్ కోయిరాల కావడం విశేషం. ఆయన నేపాలీ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2002 వరకు నేపాలీ పార్లమెంట్ సభ్యుడిగా, హౌజ్ ప్రతినిధిగా బాధ్యతలు చూశారు. 2005 నుంచి 2006 వరకు ఐటీ మినిస్టర్ గానూ నేపాలీకి సేవలు అందించారు. ఇలా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టిన మనీషా కోయిరాల ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన స్తతా చాటుకుంది.
క్యాన్సర్ ను జయించి..
మనీషా కోయిరాల కెరీయర్ తారా స్థాయిలో ఉన్న సమయంలో ఆమె అండాశయ క్యాన్సర్ కు గురైంది. 2012లో ఈ వార్త అందరినీ బాధించింది. యూఎస్ లోని న్యూయార్క్ లో కొన్ని నెలల పాటు చికిత్స పొందింది. 3 ఏళ్ల పాటు కియో థెరపీ, వైద్యుల పర్యవేక్షణలోనే ఉంది. ఇక మళ్లీ 2015 నుంచి హిందీ చిత్రాలలో మెరుస్తోంది. చివరిగా అల్లు అర్జున్ 'అలా వైకుంఠపురం' హిందీ రీమేక్ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కు తల్లి పాత్రను పోషించింది.


Click it and Unblock the Notifications











