ఎర్ర చీరలో ఎగిసిపడుతున్న మంజరి పరువాలు .. సూర్యుడికే చెమటలు పట్టిస్తోందిగా
సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని లేదు. సినీ చరిత్రలో కొందరు మాత్రమే ప్రజలకు గుర్తుంటారు. కానీ అలా తమ పేరు కూడా చరిత్రలో నిలిచిపోవాలని భావించే వారు చివరికి అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలెన్నో. అందం, అభినయం ఉండి కూడా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ల లిస్ట్ తీస్తే టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో మంజరి ఫడ్నీస్ ఒకరు.
మంజరి అంటే టక్కున గుర్తురాకపోవచ్చు కానీ కళాతపస్వి కే . విశ్వనాథ్ తెరకెక్కించిన శుభప్రదంలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి అంటే ఎవరికైనా గుర్తురాకపోదు. పద్ధతిగా చీరకట్టులో కనిపించి అచ్చ తెలుగు అమ్మాయి అనిపించుకున్నారు మంజరి. కానీ ఈ ముద్దుగుమ్మ మరాఠి పిల్ల. 10 జూలై 1984న మహారాష్ట్రలోని సాగర్‌లో జన్మించిన ఈ అమ్మడు మల్టీ టాలెంటెడ్. ఈమెలో నటి, మోడల్, గాయకురాలు ఉంది. తండ్రి భరత్ కుమార్ ఫడ్నిస్ భారత సైన్యంలో కల్నల్ కావడంతో ఆయన ఉద్యోగ రీత్యా సిమ్లా, జమ్మూ, ఢిల్లీ, ముంబై, పూణే వంటి ప్రాంతాల్లో మంజరి పెరిగారు.

చదువు పూర్తి చేసిన తర్వాత నటన వైపు అడుగుపెట్టిన మంజరి తొలుత 2004లో హిందీలో రొక్ సాకో టో రొక్ లో అనే హిందీ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు వారిని పలకరించారు. ఈ సినిమాలో మంజరి లుక్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. అచ్చ తెలుగు అమ్మాయిలా లంగా ఓణిలో పద్ధతిగా కనిపించిన మంజరి ఫడ్నిస్ ఈ క్రమంలో కళాతపస్వి కళ్లలో పడ్డారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన శుభప్రదం సినిమాలో అల్లరి నరేష్ సరసన ఆమె నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందించినా కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా కాలేదు. తర్వాత ఎన్టీఆర్ నటించిన శక్తిలో ఓ చిన్న పాత్రలో ఆమె నటించారు.
ఈ క్రమంలో తెలుగు తెరకు దూరమైన మంజరి హిందీ, కన్నడ, మలయాళం, మరాఠిలలో పలు సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో గ్రాండ్ మస్తి ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. ఏడాదికి ఖచ్చితంగా ఒక్క సినిమా అయినా చేస్తూ బండి నెట్టుకొస్తున్నారు మంజరి. గతేడాది చల్తి రహే జిందగి అనే సినిమాలో నటించారు. అయితే షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ ద్వారా అభిమానులను పలకరిస్తుంటారు మంజరి.
40 క్రాస్ చేసినా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు మంజరి. అందరు హీరోయిన్ల మాదిరిగానే మంజరిపైనా పలు రూమర్స్ వచ్చినా అవన్నీ గాలివార్తలుగానే నిలిచాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంజరి ఫడ్నిస్.. తన సినిమాలు, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. తాజాగా రెడ్ కలర్ శారీ కట్టుకుని నడుము, ఎద అందాలను చూపెడుతూ ఆమె చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మంజరి అందాలను మీరూ చూసేయండి.


Click it and Unblock the Notifications











