నా బిడ్డని కొట్టి కొట్టి చంపేశారు... గుండె పగిలేలా ఏడ్చిన ఎన్టీఆర్ హీరోయిన్

దేశంలో కుక్కకాటు కారణంగా పిల్లలు, పెద్దలు మరణిస్తుండటం, పలు ప్రమాదాలకు కారణం అవుతుండటంతో వీధి కుక్కల నియంత్రణపై గత కొంతకాలంగా వాడి వేడి చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో కుక్కలను విచక్షణారహితంగా చంపేస్తున్నారంటూ సామాజికవేత్తలు, జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. సినీ నటి రేణు దేశాయ్ సహా పలువురు సెలబ్రిటీలు జంతువులపై హింసాపై పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి మంజరి ఫడ్నీస్ విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది.

Also Read
Peddi Karnataka Box Office: కన్నడలో పెద్ది కలెక్షన్ల జోరు.. కరుప్పు వసూళ్లు బ్రేక్..
Peddi Karnataka Box Office: కన్నడలో పెద్ది కలెక్షన్ల జోరు.. కరుప్పు వసూళ్లు బ్రేక్..

సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా తెలుగు వారిని పలకరించారు ముంబై భామ మంజరి ఫడ్నీస్. ఈ సినిమాలో మంజరి లుక్స్‌కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఆ తర్వాత కళాతపస్వి కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభప్రదం సినిమాలో అల్లరి నరేష్ సరసన ఆమె నటించారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందించినా కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్‌గా కాలేదు. తర్వాత ఎన్టీఆర్ నటించిన శక్తిలో ఓ చిన్న పాత్రలో ఆమె నటించారు.

Manjari Fadnnis Breaks Down Over Dog Cruelty Incident Demands Justice for Mikey

తెలుగులో గుర్తింపు దక్కకపోవడంతో హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ భాషలలో పలు సినిమాలలో నటించారు. హిందీలో గ్రాండ్ మస్తి, చల్లి రహే జిందగి అనే సినిమాలు మంజరికి గుర్తింపు తీసుకొచ్చాయి. గతేడాది పూణే హైవే అనే సినిమాలో మంజరి నటించారు. సినిమాలతో పాటు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు, టెలివిజన్ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్‌లో మంజరి సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంజరి ఫడ్నీస్ ఎప్పటికప్పుడు తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ డ్రెస్సులలో ఆమె షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్లని మత్తెక్కిస్తాయి. అయితే మంజరి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఏడుస్తున్న వీడియోని షేర్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు.

Recommended For You
Peddi Day 6 Box Office Collections: జోరు తగ్గిన పెద్ది బాక్సాఫీస్ బ్యాటింగ్.. రాంచరణ్ మూవీ కలెక్షన్లు ఎన్ని కో
Peddi Day 6 Box Office Collections: జోరు తగ్గిన పెద్ది బాక్సాఫీస్ బ్యాటింగ్.. రాంచరణ్ మూవీ కలెక్షన్లు ఎన్ని కో

తమ కమ్యూనిటీలో ఉండే మైకీ అనే కుక్కను దారుణంగా కొట్టి చంపేశారంటూ మంజరి కన్నీటి పర్యంతమయ్యారు. 2019 నుంచి మైకీ తమతోనే ఉండేది. ఇటీవల అది కనిపించకుండా పోవడంతో మైకీని వెతికేందుకు అన్ని చోట్లా పోస్టర్లు అంటించి గాలించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇలాంటి వీడియో చేయాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాకూడదని భావిస్తున్నా. కానీ ఇది చాలా ముఖ్యమైనది అని మంజరి ఆవేదన వ్యక్తం చేశారు.

You May Also Like
సినిమాలకు రష్మి గౌతమ్ గుడ్ బై? జబర్దస్త్ యాంకర్ రియాక్షన్ ఇదే..
సినిమాలకు రష్మి గౌతమ్ గుడ్ బై? జబర్దస్త్ యాంకర్ రియాక్షన్ ఇదే..

మైకీ బేస్‌మెంట్‌లో ప్రశాంతంగా నిద్రిస్తుండగా కమ్యూనిటీకి చెందిన కొందరు సభ్యులు కర్ర లేదా ఇనుప కడ్డీతో కొట్టి కొట్టి చంపారు. తొలుత బేస్‌మెంట్ నుంచి లాబీ మధ్య ఉన్న మెట్ల దారిలోకి ఈడ్చుకెళ్లి.. నోటిలో నుంచి రక్తం కారేలా తీవ్రంగా కొట్టారు. ప్రాణభయంతో మైకీ అక్కడ మూత్రవిసర్జన చేసుకున్నాడు. కొనఊపిరితో ఉండగా వారు మైకీని ఒక గోనె సంచిలో కుక్కి.. మా కమ్యూనిటీ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశంలో పడేశారు. మైకీ ఎప్పుడు ఆనందంగా ఉండేవాడు. దానికి స్నానం చేయించడానికి, శుభ్రం చేయడానికి ఇంటికి తీసుకొచ్చే దానిని అని మంజరి వెక్కి వెక్కి ఏడ్చింది.

40 రోజులు మంచం మీదే... ఆ తప్పు ముంచేసిందంటూ రకుల్ ఎమోషనల్
40 రోజులు మంచం మీదే... ఆ తప్పు ముంచేసిందంటూ రకుల్ ఎమోషనల్

మైకీగాడు ప్రాణాలతో ఉన్నాడో లేదో తమకు తెలియదు ప్రస్తుతం దాని మృతదేహం కోసం వెతుకుతున్నాం. నేరపూరిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు తమకు నచ్చని కుక్కులను అంతం చేస్తారు. జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్ట్‌ను మంజరి ఫడ్నీస్ కోరారు. అలాగే ఈ వీడియోతో పాటు.. మా మైకీ దారుణంగా హత్య చేయబడ్డాడు. అతని కోసం మేం పోరాడతాం. సమాజంలో ఏ కుక్కకూ ఇలాంటి పరిస్ధితి మళ్లీ రాకూడదు. జంతువులను హింసించాలంటేనే ప్రజలు భయపడేలా ఉండాలి. జంతువుల పట్ల క్రూరత్వాన్ని అరికట్టేందుకు కఠినమైన చట్టాలు అవసరం. మైకీకి న్యాయం చేకూరచేందుకు మేము చేస్తున్న పోరాటంలో అండగా నిలిచిన జేవియర్ బెర్నార్డ్ శాంటియోగో, సీనియర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ శైలేంద్ర నగర్కర్‌, మా సొసైటీలోని వారికి ధన్యవాదాలు అని మంజరి రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సినీ ప్రముఖులు, నెటిజన్లు, జంతు ప్రేమికులు మంజరికి అండగా నిలుస్తున్నారు.

Manjari Fadnnis, Manjari Fadnnis crying video, Manjari Fadnnis latest news, Manjari Fadnnis about dog cruelty incident, animal cruelty cases in india, stray dogs issue India, animal rights in india, Telugu actress news, Siddhu From Srikakulam actress, Manjari Fadnnis pet dog Mikey, Manjari Fadnnis about animal welfare, Manjari Fadnnis dog, మంజరీ ఫడ్నీస్ కుక్క, మంజరీ ఫడ్నీస్ వీధి కుక్క, వెక్కి వెక్కి ఏడ్చిన మంజరీ ఫడ్నీస్, మంజరీ ఫడ్నీస్ సినిమాలు, మంజరీ ఫడ్నీస్ వీడియో, మంజరీ ఫడ్నీస్ ఫోటోలు, భారత్‌లో వీధి కుక్కలు, భారత్‌లో వీధి కుక్కల రక్షణ,

Read more about: movie news manjari phadnis
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X