For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోతో పెళ్లి విషయం మీద పెదవి విప్పిన హీరోయిన్.. సీక్రెట్‌గానే ఉంచాలంటూనే అసలు విషయం చెప్పేసింది!

  |

  హీరోయిన్ మంజిమా మోహన్, తమిళ యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ ప్రేమలో ఉన్నారని ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇద్దరూ కలిసి ఓ తమిళ సినిమాలో నటించడంతో ఆ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని, ఇరు కుటుంబ పెద్దల అంగీకారంతో వీరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ విషయం మీద స్పందించారు. ఆ ఏమన్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

  ఒకే ఫ్లాట్ లో

  ఒకే ఫ్లాట్ లో

  తమిళ సినిమా పరిశ్రమకు చెందిన సీనియర్ హీరో కార్తీక్ కుమారుడు, యంగ్ హీరో గౌతమ్ కార్తీక్ హీరోయిన్ మంజిమా మోహన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీరి ప్రేమకు పెద్దల ఆశీర్వాదం కూడా లభించిందని, త్వరలోనే ఈ ప్రేమజంట పెళ్లిపీటలెక్కుతుందని కోలీవుడ్‌ మీడియా అయితే చాలా రోజుంలా నుంచి ప్రచారం చేస్తోంది. అంతేకాదు వీరిద్దరూ ఒకే ఫ్లాట్ లో కాపురం ఉంటున్నారని ప్రచారం జరిగింది.

  మోమో అని

  మోమో అని

  అయితే ఇప్పటివరకు అటు మంజిమా కానీ, కార్తిక్‌ కానీ తమ రిలేషన్‌షిప్‌పై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల మంజిమా పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్‌ మీడియా వేదికగా తన మంజిమాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన గౌతమ్ కార్తీక్ మంజిమాను ముద్దుగా మోమో అని పిలిచాడు. 'మాంజిమా లాంటి అద్భుతమైన, శక్తిమంతమైన వ్యక్తి తన జీవితంలో ఉండటం గొప్పగా భావిస్తాను. హ్యాపీ బర్త్ డే మోమో' అని పోస్ట్‌ పెట్టాడు.

  ఊతం ఇచ్చే విధంగా

  ఊతం ఇచ్చే విధంగా

  ఇక ఈ ప్రచారానికి ఊతం ఇచ్చే విధంగా ఆ పోస్ట్ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నది నిజమేనని చాలా మంది భావించారు. కోలీవుడ్‌ మీడియా కూడా ఈ విషయాన్ని మళ్ళీ నొక్కి నొక్కి ప్రచారం చేయడంతో ఇక దీన్ని వదిలేస్తే ఎక్కడికో వెళుతుందని భావించి ఎట్టకేలకు తమ రిలేషన్‌పై వస్తోన్న వార్తలపై నోరు విప్పింది మంజిమ.

  సీక్రెట్‌గానే ఉంచాల

  సీక్రెట్‌గానే ఉంచాల

  నటీనటులకే కాదు ప్రతి మనిషికీ వ్యక్తిగత జీవితమనేది ఒకటి ఉంటుందని పేర్కొన్న ఆమె సినిమాలలో ఉండేవారు ఆయా సినిమాల వివరాలు అందరితో పంచుకున్నప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సీక్రెట్‌గానే ఉంచాలనుకుంటామని చెప్పుకొచ్చింది. అలాగే నా ప్రైవేటు లైఫ్‌ని అందరితో పంచుకోవాలని లేదని వెల్లడించింది.

  సమయం ఉందని

  సమయం ఉందని

  గౌతమ్‌ కార్తిక్‌కు- నాకూ పెళ్లి అని ఇటీవల వరుస కథనాలు దర్శనమిస్తున్నాయని, మా తల్లిదండ్రులు మొదట్లో ఆ వార్తలు చదివి ఎంతగానో బాధపడ్డారు కానీ ఇప్పుడు వాళ్లు కూడా నవ్వుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చింది. తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేదని, పెళ్ళికి ఇంకాస్త సమయం ఉందని చెప్పుకొచ్చింది. ఇక ఆ మూడు ముళ్ళు వేయించుకునే సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయటపెడతానాని పేర్కొంది.

  అంతేకాదు గౌతమ్‌ ఎంతో మంచి వ్యక్తని, నిజాయితీగా ఉంటాడని పేర్కొన్నారు. అతను నా జీవితంలో ప్రత్యేకమైన, ముఖ్యమైన వ్యక్తి అని నా కుటుంబం మొత్తానికి అతను తెలుసని పేర్కొంది. అతనితో ఉంటే సురక్షితంగా, సంతోషంగా ఉన్నాననే భావన కలుగుతుంది అని ఆమె చెప్పుకొచ్చింది.

  English summary
  Manjima Mohan Opens Up About Marriage with Gautham Karthik Relationship.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X