ఎన్టీఆర్ బయోపిక్: నారా భువనేశ్వరి పాత్రలో మలయాళీ బ్యూటీ!
అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రూపొందుతోంది. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవిత చరిత్ర వెండి తెరపై జనరంజకంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ బయోపిక్ లో నటీనటుల ఎంపికే పెద్ద సవాల్. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర వహించిన ప్రముఖుల పాత్రలకు సరైన నటుల్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. క్రిష్ ఆ పనిలోనే ఉన్నాడు.
తాజగా ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. నారా చంద్రబాబు నాయుడు పాత్ర కోసం దగ్గుబాటి రానా ఎంపికైన సంగతి తెలిసిందే. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాత్ర కోసం ప్రముఖ నటిని ఎంపిక చేయడం జరిగింది. మలయాళీ బ్యూటీ మంజిమ మోహన్ నారా భువనేశ్వరి పాత్రలో కనిపించబోతోందట.

మంజిమ మోహన్ తెలుగులో ఇప్పటికే సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ప్రకాష్ రాజ్, సుమంత్, మురళి శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











