15 ఏళ్లకే హీరోయిన్‌గా.. నేను అలా చాలా కోల్పోయా.. మన్మథుడు బ్యూటీపై షాకింగ్ ఫ్యాక్ట్స్!
తెలుగు సినిమా దగ్గర కొంతమంది హీరోయిన్స్ విషయంలో కొంచెం ఇంట్రెస్టింగ్ పరిస్థితులే కనిపిస్తాయని చెప్పాలి. కేవలం ఒకే ఒక్క సినిమాతో సెన్సేషన్ సెట్ చేసి మళ్ళీ కనుమరుగైపోయిన హీరోయిన్స్ చాలా మందే ఉంటారు. అలా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసి సినిమాలు ఆపేసిన హీరోయిన్స్ లో అక్కినేని హీరో కింగ్ నాగార్జున హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం "మన్మథుడు" లో నటించిన హీరోయిన్ కూడా ఒకరు.
కాగా ఈ చిత్రంలో సోనాలి బెంద్రే అలాగే అన్షు సాగర్ ఇద్దరు నాగ్ సరసన రొమాన్స్ చేయగా వారిలో సోనాలి అప్పటికే హిందీలో సెటిల్డ్ హీరోయిన్ పైగా తెలుగులో కూడా పలు సినిమాలు చేసింది. ఇక అన్షు సాగర్ విషయం మాత్రం ఇలా కాదు. ఈమె నటించిన ఈ ఒక్క సినిమా అందులో కూడా చాలా తక్కువ స్క్రీన్ స్పేస్ లో కనిపించినప్పటికీ అందరి దృష్టి ఆకర్షించింది.

కాగా అన్షు సాగర్ తన సినిమా ఎంట్రీ టైం చెప్పి షాకిచ్చింది. ఆమె సినిమాలో ఎంట్రీ ఇచ్చిననాటికి తన వయస్సు కేవలం 15 సంవత్సరాలే అట. మన్మథుడు సినిమాలో ఆమె వయసు అంతే అంటే ఎవరైనా నమ్ముతారా? కానీ ఇపుడు ఆమె ఆ విషయంలో చాలా బాధ పడుతుందట. తనకి నాగ్ తో సినిమా ఒక 25 ఏళ్ళు ఉన్నపుడు వచ్చి ఉంటే అప్పటి నుంచి డెఫినెట్ గా సినిమాల్లో కొనసాగి ఉండే దాన్ని అని చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆమె షేర్ చేయగా సినీ వర్గాల్లో అవి వైరల్ అవుతున్నాయి. అన్షు నిజానికి అపుడు రెండు సినిమాలు చేసింది. ఒకటి నాగ్ తో మన్మథుడు ఇంకొకటి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో రాఘవేంద్ర సినిమాల్లో మాత్రమే నటించింది. కానీ ఆసక్తికరంగా ఆ రెండు సినిమాలు కూడా ఆమెకి పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండానే చేసిందట ఈ ఇండో బ్రిటీష్ బ్యూటీ.
కాగా ఆ సినిమాలు తర్వాత సినిమాలు మీద ఎలాగో ఇంట్రెస్ట్ లేకపోవడంతో లండన్ వెళ్ళి సెటిల్ అయ్యిపోయింది. ఇక పెళ్లి, పిల్లలతో లైఫ్ సాగిస్తున్న సమయంలో ఒక ఫోన్ వచ్చిందట. మన్మథుడు సినిమా రీరిలీజ్ కోసం ఒక బైట్ ఇవ్వమని. ఆ తర్వాత సినిమా రీరిలీజ్ అయ్యి ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చూసి అన్నేళ్లు ఆమె ఏం కోల్పోయిందో తెలుసుకుందట.

అందుకే ఇక మొత్తం సర్దుకొని హైదరాబాద్ వచ్చినట్టుగా చెబుతుంది. అలా వచ్చిన వెంటనే యంగ్ హీరో సందీప్ కిషన్ సినిమా "మజాకా"లో ఆఫర్ అందుకున్నట్టుగా చెబుతుంది. అలాగే ఇక నుంచి మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె చెబుతుంది. సో ఇలా తన లైఫ్ లో చేసిన మిస్టేక్ నుంచి మళ్ళీ రియలైజ్ అయ్యి తెలుగు సినిమాలోకి అడుగు పెట్టేందుకు ఇంత సమయం తీసుకుంది.
మరి ఆమె కోరుకున్నట్టుగా మళ్ళీ తెలుగులో బిజీ అవుతుందో లేదో చూడాలి. కాగా ఈమె మజాకా సినిమాలో రావు రమేష్ సరసన ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే హిట్ దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











