నాగార్జునతో మన్మథుడు సినిమా.. హీరోయిన్ అన్షు అంతలా ఇబ్బందిపడిందా?

అన్షు అంబానీ.. బ్రిటీష్ ఇండియన్ నటి. ఈమె పేరు పెద్దగా తెలియకపోయినా.. ఆమె నటించిన చిత్రం 'మన్మథుడు' గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగార్జున కెరీర్ లో ఉత్తమ చిత్రాల్లో మన్మథుడు సినిమా ఒకటి. బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని విజయ భాస్కర్ డైరెక్టర్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథకు సహకరించారు. 2002లో వచ్చిన 'మన్మథుడు' చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఆడియెన్స్ ను మెప్పించడంతోనే కాకుండా.. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో నేషనల్ అవార్డును కూడా దక్కించుకుందీ చిత్రం.

అలాగే ఫస్ట్ ఈఫిల్ టవర్ చూపించిన చిత్రంగానూ 'మన్మథుడు' సినిమాకు రికార్డు ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని కేవలం అక్కినేని అభిమానులే కాకుండా తెలుగు ప్రేక్షకులందరూ ఇప్పటికీ తమ గుండెల్లో దాచుకున్నారు. కథ, బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, సాంగ్స్ ను ఫ్యాన్స్ నేటికీ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మూవీలో నటించిన హీరోయిన్ అన్షును ఆడియెన్స్ మరిచిపోలేనంత పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె తొలి సినిమా అయినా.. ఎక్కడా అది కనిపించకుండా జాగ్రత్త పడింది.

Manmadhudu Movie Heroine Anshu Shocking comments about Akkineni Nagarjuna

అయితే.. మొదటిసారిగా కెమెరాను ఫేస్ చేయడం, పైగా అప్పటికే పేరున్న హీరో అక్కినేని నాగార్జున సరసన నటించడంపై తాజాగా అన్షు ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేసింది. అనాటి అనుభూతులను లేటెస్ట్ ఇంటర్వ్యూలో అభిమానులతో పంచుకుంది.... ఆమెకు మొదటి సినిమానే కావడంతో చాలా నర్వస్ గా ఫీలైనట్టు తెలిపింది. నాగార్జున గారు ఎంతో సపోర్ట్ చేశారన్నారు. నాగర్జుననే స్వయంగా ఆమెకు స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారన్నారు.

ఇక ఫస్ట్ సీన్ లో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పింది. కానీ ఆమూవీ అంత పెద్ద హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. మరీ ముఖ్యంగా ఎలాంటి నటనాఅనుభం లేకుండానే తనని మన్మథుడు చిత్రంలో ఎంపికచేయడం ఇప్పటికీ మర్చిపోలేనన్నారు. ఆ తర్వాత నటనపై మరింత అవగాహన పెంచుకున్నట్టు తెలిపారు. అలాగే తన వ్యక్తిగత విషయాలనూ లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాస్తా రూపురేఖలు మారినా.. ఆమె ఎనర్జీ మాత్రం అలానే ఉండటంతో అభిమానులు ఖుషి అవుతున్నారు. ఇక మన్మథుడు తర్వాత అన్షు రెబల్ స్టార్ ప్రభాస్ సరసన 'రాఘవేంద్ర' చిత్రంలో నటించి తెలుగు ఆడియెన్స్ ను అలరించింది. అలాగే మిస్సమ్మలోనూ మెరిసింది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. 20 ఏళ్ల తర్వాత ఊహించని విధంగా కంబ్యాక్ ఇస్తోంది.

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'మజాకా'తో తెలుగు ఆడియెన్స్ ను మళ్లీ పలకరించబోతోంది. ఫిబ్రవరి 21న మజాకా చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో ఆమె రోల్ ఎలాంటి ఉంటుంది.. రీఎంట్రీకి మంచి ఫలితాన్ని అందిస్తుందా? లేదా? అనే విషయాన్ని వేచి చూడాలి. ఇప్పటికే సీనియర్ హీరోయిన్లు తమ సత్తాను చాటుకుంటున్నారు. రీఎంట్రీలో మరింత జోష్ ను కనబరుస్తూ విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో అన్షు రీఎంట్రీతో ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X