ఆ డైరెక్టర్‌‌తో అలాంటి సంబంధం.. అందుకే ముద్దు పెట్టాడు.. బిగ్‌బాస్‌లో మన్నారా చోప్రా క్లారిటీ

Mannara Chopra: టాలీవుడ్ హీరోయిన్ మన్నారా చోప్రా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2014లో వచ్చిన ప్రేమ గీమ జాన్ తా నయ్ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన ఈ క్యూట్ బ్యూటీ ఆ తర్వాత జిద్ అనే సినిమాతో బాలీవుడ్ లోనూ మెరిసింది. ఇక ఆ తర్వాత సన్ధమారుతం చిత్రంలో అతిథి పాత్రలో, కావాల్ అనే పాటలో కనిపించింది. ఆ తర్వాత జక్కన్న, తిక్క, రోగ్, సీత వంటి చిత్రాల్లోనూ మెరిసి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది.

Mannara Chopra Shocking Comments About Director Ravikumar Kissing Her

రాజ్ తరుణ్, మన్నారా చోప్రా కాంబోలో రాబోతున్న తాజా చిత్రం తిరగబడరా సామీ. ఈ సినిమాకు రవికుమార్ దర్శకుడిగా పని చేయగా.. ఈ చిత్రం ఈవెంట్ లోనే ఆయన హీరోయిన్ కు కిస్ ఇచ్చాడు. అందరి ముందు ముద్దు పెట్టకోవడంతో డైరెక్టర్ రవికుమార్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే దీని గురుంచి బిగ్ బాస్ షోపైనే సల్మాన్ ఖాన్ ప్రశ్నించగా.. డైరెక్టర్ ముద్దు ఇవ్వడంపై అనవసరంగా అందా రాద్ధాంతం చేశారని మన్నారా చోప్రా చెప్పుకొచ్చింది. ఆయన ఎలాంటి తప్పుడు ఉద్దేశంతో అలా చేయలేని వెల్లడించింది.

డైరెక్టర్ రవికుమార్ చాలా రోజుల తర్వాత తనను చూడడంతో అలా ముద్దు పెట్టారని.. తాము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని మన్నారా చోప్రా వివరించింది. అలాగే ఆయన తనకు తండ్రితో సమానం అని, తమ మధ్య ఉన్న ఆ బంధం, అభిమానంతోనే ఆయన తనకు ముద్దు ఇచ్చారని స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా సార్లు దీని గురించి చెప్పానని.. రవికుమార్ కు తాను చిన్న పిల్లతో సమానం అని మరోసారి వివరించింది. ఇంత చిన్న దానిని చాలా పెద్దగా చేసి చూస్తున్నారని, దాని వల్ల తాను, డైరెక్టర్ చాలా ఫీల్ అయినట్లు పేర్కొంది.

Mannara Chopra Shocking Comments About Director Ravikumar Kissing Her

ఏది ఏమైనా ఇకనైనా తానిచ్చిన క్లారిటీతో ఈ వివాదం ముగిస్తుందని భావిస్తున్నట్లు మన్నారా చెప్పుకొచ్చింది. గతంలో ఎన్ని చిత్రాలు చేసినా చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమా హిట్ కాలేదు. మరి ఇప్పుడు బిగ్ బాస్ ద్వారానైనా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుని అద్భుతమైన సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X