Manushi Chhillarఎరుపు రంగు బికినీలో వరుణ్ తేజ్ హీరోయిన్.. ఇంత హాట్‌గా మీరు ఎప్పుడైనా చూశారా?
జీ మిస్ వరల్డ్..మిస్ ఇండియా మానుషీ చిల్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరియాణాకి చెందిన మానుషీ చిల్లర్2017లో 'మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. 2019లో సెక్సీయెస్ట్ వెజిటేరియన్ పర్సనాలిటీ ఇన్ ఇండియాగా మానుషీ చిల్లర్ అవార్డును గెలుచుకున్నది.
ఇక ఆ తర్వాత 2022లో సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా అమ్మడికి ఆఫర్స్ కు మాత్రం ఏం తక్కువ చేయలేదు. దీని తరువాత ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ అంటూ ఒక సినిమా చేసింది. ఇది కూడా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. అయినా వరుస సినిమాలను అందుకొని ఆమె మిగతా హీరోయిన్లకు షాక్ ఇచ్చింది.

ఇక బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా ఈ చిన్నది బాగానే హడావిడి చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌నటించిన ఆపరేషన్ వాలెంటైన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా అమ్మడికి పేరు తెచ్చింది లేదు. ఈ ఏడాదే అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన బఢే మియా ఛోటే మియాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ఆమెకు విజయాన్ని అందించింది లేదు.
సినిమాల విషయం పక్కన పెడితే అమ్మడి అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పాలి. పరువాల విందుతో కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించేస్తోంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ రెట్టింపు చేసి తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది.
ఇక ఆమె ఫ్యాషన్ ఎంతో విభిన్నంగా ఉంటుంది. అందరిలా కాకుండా ఆమె ఎంచుకొనే కలర్స్ కానీ, ధరించే దుస్తులు కానీ ఎంతో భిన్నంగా ఉంటాయి. తాజాగా ఈ చిన్నది రెడ్ బికినీలో అందాలను అలా పరిచేసింది. పాల నురగ లాంటి దేహంపై ఆ రెడ్ బికినీ.. ఎంతో అందంగా కనిపించింది.
నాజూకైన శరీరాకృతికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం మానుషీ జాన్ అబ్రహంతో తెహ్రాన్ అనే సినిమా చేస్తోంది, త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మానుషీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











