Bandhavi Sridhar : మతిపోగొడుతోన్న మసూద బ్యూటీ .. నల్ల చీరలో ఒంపు సొంపులు అదరహో

సీనియర్ హీరోయిన్ సంగీత కీ రోల్ పోషించిన మసూద చాలా మందికి గుర్తుండే ఉంటుంది. హర్రర్ కామెడీ సినిమాలు దున్నేస్తోన్న దశలో టాలీవుడ్‌లో దిగిన ట్రూ హార్రర్ మూవీగా మసూద ప్రేక్షకులను నవ్వించింది. ఆ సినిమాలో సంగీత కుమార్తెగా , దెయ్యం పట్టిన అమ్మాయిగా అద్భుతంగా నటించారు బాంధవి శ్రీధర్. క్యూట్ లుక్స్‌తో, మెస్మరైజింగ్ స్మైల్‌తో ఆ అమ్మాయి అందానికి కూడా మంచి మార్కులే పడ్డాయి. అచ్చ తెలుగు అమ్మాయి అయిన బాంధవికి ఈ సినిమా తర్వాత మరిన్ని ఆఫర్లు వస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన బాంధవి తొలుత బాలనటిగా చిత్ర సీమలో అడుగుపెట్టారు. మిస్టర్ పర్ఫెక్ట్, రభస, మొగుడు, రామయ్య వస్తావయ్య , మజ్ను తదితర సినిమాలలో ఆమె నటించింది. విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్ వైపు అడుగుపెట్టిన బాంధవి .. 2019లో జరిగిన మిస్ ఇండియా పోటీలలో రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది జరిగిన మిస్ ఆంధ్రప్రదేశ్ 2019 పోటీల్లో విజేతగా నిలిచింది. ఈ క్రమంలో సినీ రంగంలో అడుగుపెట్టిన బాంధవి శ్రీధర్.. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సినిమాల్లో చిన్నా చితకా పాత్రల్లో తళుక్కున మెరిశారు. ఇలాంటి దశలో మసూద సినిమా ఆమెకు బ్రేక్ ఇచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిన్న సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడంతో పాటు బాంధవికి కూడా మంచి పేరు తీసుకొచ్చింది.

masooda fame Bandhavi Sridhar PhotoShoot with black color saree Her latest photos here

మసూద హిట్ తెచ్చుకున్నా.. ఈ సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించినా.. బాంధవి శ్రీధర్‌ ఏ సినిమాలోనూ కనిపించకపోవడం చిత్ర సీమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈమె తన ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్ హీరోగా తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జాట్‌లో బాంధవి ఛాన్స్ కొట్టేసింది. బడా నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి.

జాట్‌లో రెజీనా కసాండ్రా, సయామి ఖేర్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అయేషా ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జాట్ విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలతో మంచి ఊపు మీదున్న ఎస్ఎస్ థమన్.. జాట్‌కు స్వరాలు అందిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సన్నీ డియోల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన జాట్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఇందులో బాంధవి ఎలాంటి పాత్ర పోషించిందో తెలియాల్సి ఉంది.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బాంధవి శ్రీధర్ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులు, ఇతర విశేషాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అన్నింటికి మించి హాట్ ఫోటో షూట్‌లతో కుర్రకారులో సెగలు రేపుతుంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా నల్ల చీర కట్టి నడుము, ఎద అందాలు చూపిస్తున్న ఫోటోలను బాంధవి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ షేర్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: bandhavi sridhar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X