మెగా హీరోపై మనసు పారేసుకున్న యంగ్ హీరోయిన్!
మన తెలుగు సినిమా దగ్గర ఎప్పుడు ఏ హీరోయిన్ లేదా ఏ ఫిమేల్ నటి ఎలా ఫేమస్ అవుతుందో చెప్పలేం.. అలా ఇటీవల కాలంలో చాలా మంది యంగ్ బ్యూటీస్ లైట్ లోకి వచ్చి హైలైట్ అయ్యారు. అలా చాలా మంది మరిన్ని మంచి అవకాశాలు దక్కించున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజులు ఓ రేంజ్ లో వైరల్ అయ్యిన పేరు ఏదన్నా ఉంది అంటే అది రియా అని చెప్పాలి.
టాలీవుడ్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మత్తు వదలరా 2 సినిమా ఎప్పుడు అయితే ఓటిటిలో విడుదలకి వచ్చిందో ఆ సినిమాలో నటించిన ఓ యంగ్ బ్యూటీ రియాగా కనిపించింది. కాగా అందులో రియా పేరిట దర్శకుడు రితేష్ రానా రాసుకున్న కామెడి సీన్స్ ఓ రేంజ్ లో హైలైట్ అవ్వడంతో తెలుగు యువ అంతా రియా ఎవరు? రియా ఎక్కడ అంటూ ఆమె జపం చేస్తూ వచ్చారు.

కాగా ఈ రియా అసలు పేరు ఇషా యాదవ్ కాగా ఈ యంగ్ బ్యూటీ నార్త్ ఇండియా నుంచి మొదటిసారిగా తెలుగు సినిమాలో కనిపించింది. అయితే ఒక్కసారిగా హైలైట్ అయ్యిన ఈ యంగ్ హీరోయిన్ మెగా హీరోస్ లో ఓ హీరో అంటే బాగా క్రష్ అట.. అది కూడా తన స్కూల్ ఏజ్ తొమ్మిదో క్లాస్ నుంచే ఆ మెగా హీరో అంటే ఎంతో ఇష్టం అని చెప్పిన కామెంట్స్ ఇపుడు హైలైట్ గా మారాయి.
మరి ఈ యంగ్ చిక్ కి అంతలా నచ్చిన మెగా హీరో ఎవరో కూడా కాదు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అట. తనకి సౌత్ లో రామ్ చరణ్ అంటే ఎంతో ఇష్టం అని అది కూడా తన 9త్ క్లాస్ నుంచే చరణ్ అంటే ఎంతో క్రష్ అని ఆమె చెప్పుకొచ్చింది. దీనితో చరణ్ ఖాతాలో మరో లేడీ ఫ్యాన్ అది కూడా అందమైన ఫ్యాన్ పడింది అని చెప్పాలి. చరణ్ కి సినిమాల పరంగా కానీ ఆఫ్ లైన్ లుక్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.

కానీ లేడీ ఫాలోయింగ్ అయ్యితే తనకి సెపరేట్ అని చెప్పొచ్చు. ఇక నార్త్ నుంచి కూడా చరణ్ కి ఈ రేంజ్ క్రేజ్ అంటే తన ఫాలోయింగ్ ఎలా ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఇలా మొత్తానికి అయితే ఒక్క సినిమాలో సెన్సేషన్ అయ్యిన రియా తన ఫెవరెట్ హీరో అండ్ క్రష్ ఎవరో రివీల్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.
మరి ఈ యంగ్ నటి చరణ్ ని ఎపుడు కలుస్తుందో కలిసాక ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి మరి. ప్రస్తుతం అయితే మత్తు వదలరా 2 ఫేమ్ తో రియా అదే ఇషా ఆ కిక్ ని ఎంజాయ్ చేస్తుంది. అలాగే ఇంకోపక్క గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భారీ సినిమా గేమ్ ఛేంజర్ రిలీజ్ తో సిద్ధంగా ఉన్నాడు. అలాగే ఇంకోపక్క దర్శకుడు బుచ్చిబాబు సానాతో సినిమాకి రెడీ అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











