హిట్‌ జోష్‌లో హద్దులు దాటేసిందిగా.. బ్యాక్‌లెస్ అందాలతో రీతూ వర్మ సెగలు

తెలుగు అమ్మాయి రీతూ వర్మ తన అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. స్కిన్ షోకు దూరంగా కథకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తూ దూసుకెళ్తున్నారు రీతూ. రీసెంట్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంతో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మజాకా విజయం సాధించడంతో రీతూ హిట్ జోష్‌లో ఉన్నారు. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

హైదరాబాద్‌లో మధ్యప్రదేశ్‌కు చెందిన కుటుంబంలో జన్మించారు రీతూ వర్మ. మల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన రీతూ వర్మ .. మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించారు. మిస్ హైదరాబాద్ బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అనంతరం షార్ట్‌ఫిల్మ్స్‌లోకి అడుగుపెట్టిన రీతూ వర్మ అనుకోకుండా అనే షార్ట్ ఫిల్మ్‌తో యూత్‌ను ఆకట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు పలు అవార్డులు, రివార్డులు వచ్చాయి. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన బాద్ షాలో కాజల్ అగర్వాల్‌కు చెల్లెలిగా నటించారు.

Mazaka Heroine Ritu Varma shares Her latest pics in crossandra color saree

ఈ దశలో ప్రేమ ఇష్క్ కాదల్‌తో సోలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రీతూ వర్మ ఆ తర్వాత నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలు చేశారు. ఈ నేపథ్యంలో తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పెళ్లి చూపులతో రీతూ బ్రేక్ అందుకున్నారు. అనంతరం కేశవ, నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్, వరుడు కావలెను, ఒకే ఒక జీవితం, కణం, స్వాగ్ చిత్రాలలో నటించారు. తెలుగుతో పాటు తమిళ్‌లోనూ మంచి అవకాశాలు అందుకుని నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు రీతూ వర్మ. ప్రస్తుతం కోలీవుడ్ విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ధ్రువ నక్షత్రం సినిమాలో ఆమె నటిస్తున్నారు.

అయితే 35 ఏళ్ల వయసొచ్చినా ఆమె పెళ్లి మాట ఎత్తకపోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే మొన్నామధ్య ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఆయనను పెళ్లాడబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. దీనికి కారణాలు కూడా లేకపోలేదు.. ఆ హీరో ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, చనువుగా ఉండటం వంటి అంశాలు రీతూ ప్రేమలో ఉంది అనడానికి బలం చేకూరుస్తున్నాయి. కానీ దీనిపై ఆమె మాత్రం మౌనం వీడలేదు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అచ్చ తెలుగు అమ్మాయి ఎప్పటికప్పుడు తన సినిమాలు, వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా పర్పుల్ కలర్ చీర కట్టి, బ్యాక్ కనిపించేలా బ్లౌజ్ ధరించి రీతూ వర్మ హాట్ హాట్ ఫోటో షూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం ఈ మజాకా భామ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: mazaka ritu varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X