‘స్టార్ హీరో నుంచి అలా తప్పించుకున్నా.. ఆ హోటల్‌ అంటే వణికిపోతా’

బాల నటిగా కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్‌గా దక్షిణాదిని ఏలారు సీనియర్ హీరోయిన్ మీనా. దాదాపు 4 దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో తన అందం, అభినయంతో అలరించారు మీనా. చూడచక్కని రూపం, చిరునవ్వుతో 90వ దశకంలో కుర్రకారుకి కలల రాకుమారిగా నిలిచారు మీనా. 50 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్నారు మీనా. అందరు స్టార్ హీరోలతో, హీరోయిన్లతో మీనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఓ హీరో కారణంగా తాను ఇబ్బంది పడినట్లు ఓ ఇంటర్వ్యూలో మీనా తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే..

Also Read
రాజశేఖర్ కూతురినని తెలిసి కూడా తీసేశారు... శివాత్మిక రాజశేఖర్ భావోద్వేగం
రాజశేఖర్ కూతురినని తెలిసి కూడా తీసేశారు... శివాత్మిక రాజశేఖర్ భావోద్వేగం

బాలనటిగా తొలుత ఎంట్రీ ఇచ్చిన మీనా.. ఆ తర్వాత హీరోయిన్‌గా మారి దక్షిణాదిలోని అందరు స్టార్ హీరోలతో ఆడిపాడారు. సౌందర్య, రోజా, రమ్యకృష్ణ, రంభ, ఖుష్బూ వంటి స్టార్ హీరోయిన్లు వెండితెరను ఏలుతున్న సమయంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 200 పైగా సినిమాల్లో నటించారు. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పటికీ విద్యాసాగర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను పెళ్లాడారు మీనా. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. ఈ చిన్నారిని థేరి సినిమాతో బాలనటిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు మీనా.

Meena Reveals Mithun Chakraborty Repeatedly Approached Her for Films During Her Peak Career

పెళ్లి, కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. దృశ్యం సిరీస్‌తో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. తన వయసు, ఇమేజ్‌కు తగ్గ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఆమె జీవితం సాఫీగా సాగుతున్న దశలో మీనా భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో 2022 జూన్ 28న కన్నుమూశారు. భర్త మరణంతో ఒంటరి అయిన మీనా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సినిమాలతో పాటు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం తమిళంలో మూకుతి అమ్మన్ 2, రౌడీ బేబీ సినిమాలలో మీనా నటిస్తున్నారు.

Recommended For You
'సూపర్‌స్టార్ అయితే ఏంటీ? నన్ను ఒప్పించాలని అలాంటి ట్రాప్’
'సూపర్‌స్టార్ అయితే ఏంటీ? నన్ను ఒప్పించాలని అలాంటి ట్రాప్’

ఇటీవల తన ఇంటిని కళ్లు చెదిరే ధరకు అమ్మి 100 కోట్లకు పైగా లాభాలను అందుకుని సినీ వర్గాలకు షాకిచ్చారు. కొన్నేళ్ల క్రితం ఆమె దాదాపు 10 కోట్ల రూపాయలతో ఎంతో అందంగా నిర్మించుకున్న ఆ ఇంటిని లాభాలకు సేల్ చేశారు. తద్వారా మీనా బిజినెస్ మైండ్ ఏంటో అందరికీ చూపించారు. పెట్టుబడి పెట్టడంతో పాటు సరైన సమయంలో దానితో ఎలా లాభాలను సంపాదించాలో చేసి చూపించారు మీనా. ఇక మీనా రెండో పెళ్లి గురించి పలుమార్లు మీడియాలో వార్తలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అయ్యాయి. వీటన్నింటికీ మీనా చెక్ పెట్టారు. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు.

You May Also Like
14 ఏళ్లుగా ఆ బాధ గుండెల్లోనే ... కార్తీక దీపం నటి భావోద్వేగం
14 ఏళ్లుగా ఆ బాధ గుండెల్లోనే ... కార్తీక దీపం నటి భావోద్వేగం

ఆ రోజుల్లో మంచి సక్సెస్‌లో ఉన్న హీరోయిన్లను, క్రేజ్ ఉన్న హీరోయిన్లను తమకు సెట్ అవుతారు అనుకుంటే.. తమ సినిమాలలో నటించాల్సిందిగా హీరోలు అడిగేవారు. ఈ జంటలు హిట్ పెయిర్‌లుగా జనం గుండెల్లో నిలిచిపోయాయి. అలాగే మీనా పీక్స్‌లో ఉన్నప్పుడు ఓ స్టార్ హీరో ఆమె వెంటపడ్డారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వూలో తెలిపారు. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ దిగ్గజం మిథున్ చక్రవర్తి.

సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు
సూపర్‌స్టార్ కొడుకుని 6 ఏళ్లు వెంటాడిన హీరోయిన్... బిడ్డని అలా కాపాడుకున్న నటుడు

ఆ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ.. నాకు హిందీలో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అయితే దక్షిణాదిలో చాలామంది ఆఫర్లు, మంచి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. తమిళ్, తెలుగు ఇలా ఏ భాష చూసినా మంచి అవకాశాలు వస్తున్నాయి. దాంతో ఇవన్నీ వదిలేసి అక్కడికి వెళ్లాలని అనిపించలేదు. అక్కడ పరిస్ధితులు మనకి తెలియవు... ఉన్నది వదిలేసుకుని అక్కడికి వెళ్లి, ఏమాత్రం తేడా వచ్చినా కెరీర్‌కు ఇబ్బందే. హిందీ ఇండస్ట్రీ నుంచి నాకు ఎక్కువగా మిథున్ చక్రవర్తి గారి నుంచి వచ్చేవి. రంభ ఆయనతో సినిమా చేసినప్పుడల్లా నా గురించి చెప్పేది. నిజం చెప్పాలంటే ఊటీకి వెళ్లాలంటే నాకు భయంగా ఉండేది. ఆయన హోటల్‌లో వద్దు, వచ్చేస్తారు అని మీనా అన్నారు.

'16 ఏళ్ల వయసులో దానికి బానిసనయ్యా ... రెండు సార్లు కావాల్సిందే’
'16 ఏళ్ల వయసులో దానికి బానిసనయ్యా ... రెండు సార్లు కావాల్సిందే’

మిథున్ గారికి ఊటీలో ఒక హోటల్ ఉంది. చాలా సినిమాలు, సాంగ్స్ ఆయన అక్కడే షూట్ చేసేవారు. దాంతో ఆయన హోటల్ మాత్రం వద్దు అనుకునేదానిని. పాపం రెండు మూడు సార్లు రూమ్ దాకా వచ్చి.. ఏంటీ మీనా గారు నాతో సినిమాలు చేయరా అని అడిగేవారు. మిథున్ గారికి నో ఎలా చెప్పాలో తెలిసేది కాదు.. అంతపెద్ద మనిషికి ముఖం మీద చెప్పలేం. కుదిరితే ఖచ్చితంగా చేస్తాము కదా? ఒకసారి చెప్పొచ్చు, రెండుసార్లు చెప్పొచ్చు.. ప్రతిసారి మనం చెప్పలేం కదా? దాంతో ఊటీ వెళితే మాత్రం ఆ హోటల్ వద్దు అని చెప్పేదానిని అని మీనా గుర్తుచేసుకున్నారు.

'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’
'ఆ క్షణంలో అలా లొంగిపోయా.. అన్నీ కోల్పోయాకే విలువ తెలిసేది’

ఆయనే కాదు యష్ జీ, సూరజ్ భరజాత్య వంటి వారి ప్రొడక్షన్ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చేవి. వాళ్ల సినిమాలు కూడా నాకు తగ్గట్లుగానే ఉండేవి. రిథమ్ షూటింగ్ ముంబైలో జరిగినప్పుడు యష్‌నీ కలిశా. ఆయన చాలామంచి వారు ఆఫీస్ బయటకు వచ్చేసి మీనాజీ మీనాజీ.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ని అని చెప్పేవారు. నేను మీ సినిమాలకు పెద్ద అభిమానిని.. నేను చెప్పాలనుకున్నది మీరు చెబుతున్నారు అనే దానిని. ఇవన్నీ చాలా అందమైన జ్ఞాపకాలని అంటూ మీనా ఎమోషనల్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X