అ నటుడితో పీకల్లోతు ప్రేమలో మీనా... మనసుని ముక్కలు చేసిన స్టార్ హీరో
బాలనటిగా ఎంట్రీ ఇచ్చి దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు మీనా. మూడు దశాబ్ధాలకు పైగా కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. తన భర్త మరణంతో ఒంటరి అయిన ఈ ముద్దుగుమ్మ.. తన కూతురు కోసం అలా మొండిగా బతికేస్తున్నారు. మీనా రెండో పెళ్లి అనేది ఇండస్ట్రీలో ఇప్పటికీ హాట్ టాపిక్కే. ఆమె మరోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారంటూ పలుమార్లు గాసిప్స్ వచ్చాయి. అయితే వీటికి ఆమె తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చి పుకార్లకు చెక్ పెట్టారు.
బాలనటి నుంచి స్టార్ హీరోయిన్‌గా
మీనా అసలు పేరు.. మీనా దురైరాజ్. చెన్నైలోనే పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ తొలుత బాలనటిగా ఎంట్రీ ఇచ్చారు. 1982లో ఆరేళ్ల వయసులో నడిగర్ తిలకం శివాజీ గణేషన్ హీరోగా వచ్చిన నెంజాంగల్‌లో బాలనటిగా నటించారు. అలా దాదాపు 45 చిత్రాలలో బాలనటిగా నటించిన మీనా.. 1990లో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన నవయుగం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అందం, అభినయం, డ్యాన్స్‌లలో తన సత్తా చాటుతూ దక్షిణాదిలో వరుస అవకాశాలతో దూసుకెళ్లారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అగ్రనటులతో కలిసి నటించారు.

దక్షిణాదిలో అగ్రనటిగా
రమ్యకృష్ణ, సౌందర్య, రోజా, రంభ తదితర హీరోయిన్లు వెండితెరను ఏలుతున్న దశలో తన మార్క్ చూపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డ్ సహా పలు పురస్కారాలు మీనాను వరించాయి. సినిమాలతో పాటు సీరియల్స్‌తోనూ సత్తా చాటారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా, హోస్ట్‌గా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు.
భర్త మరణంతో ఒంటరి
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గుతున్న దశలో 2009లో బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను పెళ్లాడారు. ఈ దంపతులకు నైనిక అనే కుమార్తె ఉంది. 2022లో అనారోగ్యంతో విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఆమె కృంగిపోయారు. అయితే తన స్నేహితులు, కుటుంబ సభ్యుల సాయంతో తిరిగి కోలుకున్న మీనా... సినిమాలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. తన కుమార్తె నైనికను తేరీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. పెళ్లి, పిల్లలతో కొన్నాళ్లు సినీరంగానికి దూరంగా ఉన్న మీనా.. ఇటీవల తిరిగి బిజీ అవుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో దృశ్యం 3, తమిళంలో రౌడీ బేబీ సినిమాలో మీనా నటిస్తున్నారు.
ఆ హీరోను ఇష్టపడ్డ మీనా
కెరీర్‌లో ఎందరో సూపర్‌స్టార్స్‌తో కలిసి నటించిన మీనాకు అప్పట్లో ఎందరో డై హార్డ్ ఫ్యాన్స్ ఉండేవారు. 90's కిడ్స్‌లో చాలామంది తమకు కాబోయే భార్య మీనాలా ఉండాలని కోరుకున్నారంటే అతిశయోక్తి కాదు. 50 ఏళ్ల వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో మెరిసిపోతున్న మీనా కూడా ఒకానొక సమయంలో ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడ్డారట. అంతేకాదు.. పెళ్లంటూ చేసుకుంటే అతనినే చేసుకుంటానని తన తల్లితో కూడా చెప్పేవారట. ఆయన ఎవరో కాదు.. బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలలో మీనా చెప్పారు. తాను ఎంతగానో ఇష్టపడ్డ హృతిక్ రోషన్‌కు పెళ్లి కావడంతో తన గుండె ముక్కలైందని.. అప్పటికీ తనకు పెళ్లి కాలేదని మీనా నవ్వుతూ అన్నారు. అయితే ఓ కార్యక్రమంలో తన అభిమాన నటుడైన హృతిక్ రోషన్‌ను కలిసి సెకండ్ ఇచ్చిన ఫోటో తనకు మెమొరబుల్ అని తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











