48 ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి ? ఆ స్టార్ హీరోతో రిలేషన్ పై క్లారిటీ..
Meena: హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 90లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తన సహజ నటనతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. కోట్లాది మంది అభిమానులకు సొంతం చేసుకుంది. అంత బాగానే ఉన్న సమయంలో మీనా జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా మరణించారు. దీంతో మానసికంగా కుంగిపోయింది. ఆ బాధ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. అయితే.. గతకొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ రూమార్స్ పై మీనా షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇటీవల నటీ మీనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను రెండో పెళ్లిపై వస్తున్న రూమార్స్ పై స్పందించారు. 'సోషల్ మీడియా లో ఏదోకటి రాయాలి. ఏదోక విషయాన్ని హైలైట్ చేయాలని కొంతమంది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. తమిళ్ హీరో థనుష్ తో ఇతర హీరోలతో ట్యాగ్ చేస్తూ.. పిచ్చి పిచ్చి వార్తలు రాస్తున్నారు. మొయిన్ గా హీరో థనుష్ తో పెళ్లి చేసుకోబోతుంది రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన సింగల్ గా ఉన్నారని అలా రాస్తున్నారు. అతడే కాకుండా.. ఇండస్ట్రీలో చాలా మంది సింగల్ గా ఉన్నారు. వాళ్లతో కూడా కలిసి వార్తలు రాసేలా ఉన్నారు. వార్తలు లేకపోతేనే ఇలాంటి రూమార్స్ క్రియేట్ చేస్తున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు.

మీనా ఇంకా మాట్లాడుతూ ..'నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. ప్రతి వారితోనూ ఫ్రెండ్లీ గానే ఉంటాను. లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు? రాసే ముందు ఒక్క మాట నన్ను అడగవచ్చు కాదా? నేను ఏమైనా నిర్ణయం తీసుకుంటే.. మీడియాకు చెపుతా కాదా? అని ప్రశ్నించారు. 'నా జీవితం తెరిచిన పుస్తకం. నా జీవితంలో నటించి సినిమాలు, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ప్రతి విషయం అందరికి తెలుసు. నేను ఎన్నో సంవతర్సాలుగా ఇండస్ట్రీలో ఉన్నా.. నా జీవితం, నా కేరిర్ గురిచి అంతా తెలిసినా ఇలా ' అంటూ ఎమోషనల్ అయ్యారు.

జీవితంలో ఎప్పుడూ ఏం జరుగుతుందో చెప్పలేను. నా భర్త చనిపోతాడని ఏ క్షణంలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఏం జరగాలో అది జరిగిపోతుంటుంది. ఇది చేయాలి.. అది చేయాలి అని ప్లాన్ చేసుకొంటే కుదరదు. నా లైఫ్‌లో కూడా అంతే.. నేను ప్రస్తుతం దేని గురించి ఆలోచించడం లేదు. సాధ్యమైనంత వరకు ఒంటరిగానే జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాను. నాకు ఓ కూతురు ఉంది. నా కూతురు నైనిక విద్యాసాగర్ భవిష్యత్ నాకు ముఖ్యం. నా జీవితంలో ఏం జరిగితే .. అలా నేను ముందుకు సాగుతాను ' అని మీనా అన్నారు.


Click it and Unblock the Notifications











