twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Khiladi:రవితేజతో లిప్ లాక్ సన్నివేశంపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ముందే ఊహించిందట

    |

    మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడి సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ మొత్తానికి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేసింది. ఇక సినిమాలో లిప్ లాక్ సన్నివేశం హైలెట్ గా నిలిచింది. రవితేజ మొదటిసారిగా అలా లిప్ లాక్ సీన్ లో యాక్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఆ లిప్ లాక్ సీన్ పై క్లారిటీ ఇచ్చేసింది. ఆ సీన్ చేయడానికి తాను ఏమి ఇబ్బంది పడలేదు అని చెప్పుకొచ్చింది. ఇంకా ఏం చెప్పింది అనే వివరాల్లోకి వెళితే...

     ట్రైలర్ తో పాజిటివ్ బజ్

    ట్రైలర్ తో పాజిటివ్ బజ్

    టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రోజుల అనంతరం మళ్ళీ సినిమాల సందడి మొదలు కాబోతోంది. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఖిలాడి ఈ నెల 11న భారీ స్థాయిలో విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా కొంత పాజిటివ్ బజ్ అయితే క్రియేట్ చేసింది. సినిమా ఫుల్ కమర్షియల్ గా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

     గ్లామర్ ప్రజెంటేషన్ లో పోటీగా..

    గ్లామర్ ప్రజెంటేషన్ లో పోటీగా..

    ఖిలాడి సినిమాను రమేష్ వర్మ దర్శకత్వంలో రూపొందించారు. ఇక రవితేజ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా మరో గ్లామరస్ పాత్రలో డింపుల్ హాయతి ఆకట్టుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా గ్లామర్ ప్రజెంటేషన్ లో గట్టిగానే పోటీ పడినట్లు అనిపిస్తోంది. మొత్తానికి ట్రైలర్ అయితే మంచి బజ్ క్రియేట్ చేసింది. యాక్షన్ సన్నివేశాలు అలాగే రొమాన్స్ కూడా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.

     లిప్ లాక్ సీన్ హైలెట్ అయ్యేలా..

    లిప్ లాక్ సీన్ హైలెట్ అయ్యేలా..

    ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, రవితేజ మధ్యలో వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కూడా హైలెట్ కాబోతునన్నాయట. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ మోదటిసారి లిప్ లాక్ సన్నివేశంలో నటించిన విషయం తెలిసిందే. ట్రైలర్ లో కూడా ఆ సీన్ హైలెట్ గా నిలిచింది. అయితే కమర్షియల్ గా ఆలోచించే ఆ సీన్ ను సినిమాలో పెట్టడం జరిగినట్లుగా ఒక టాక్ అయితే వస్తోంది.

    ముద్దుపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

    ముద్దుపై క్లారిటీ ఇచ్చిన మీనాక్షి

    ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి లిప్ లాక్ సన్నివేశంపై క్లారిటీ ఇచ్చింది. అలాంటి ఇంటిమెంట్ సీన్స్ గురించి యాక్టింగ్ క్లాస్ లోనే తెలుసుకున్నాను అని అయితే కథ పరంగా పాత్రకు తగ్గట్టుగా ఉంటేనే చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. అంతే కాకుండా కమర్షియల్ సినిమాల్లో ఇలాంటి చాలా సాధారణం అని కూడా తెలియజేసింది.

    Recommended Video

    Krack సక్సెస్ జోష్ లో Ravi Teja | Khiladi First Glimpse On Republic Day | Filmibeat Telugu
     ఇబ్బంది పడలేదు..

    ఇబ్బంది పడలేదు..

    ఫైనల్ గా మీనాక్షి చౌదరి అయితే ముద్దు సీన్ లో నటించడంపై ఏ విధంగాను ఇబ్బంది పడలేదు అని ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. ఇక మీనాక్షి చౌదరి సినిమాలో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ పాత్రలో నటించిందట. అంతే కాకుండా రొమాంటిక్ సన్నివేశాలలో కూడా బ్యూటీ పాత్రకు తగ్గట్టుగా కొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. హిందీలో కూడా ఖిలాడి సినిమాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    Meenakshi chaudary about ravi teja lip lock scene,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X