ఆ హీరోతో డేటింగ్ అంటూ రూమర్స్... పెళ్లిపై మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పలువురు సెలబ్రిటీలు తమ ప్రేమాయణాలకు చెక్ పెట్టి వైవాహిక బంధంతో ఒక్కటవుతున్నారు. వీరిలో కొత్తగా పెళ్లి పీటల మీదకి అడుగుపెట్టేవారు కొందరైతే, విడాకులు తీసుకుని రెండో పెళ్లి చేసుకున్నవారు కూడా ఉన్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తన ప్రియుడు, దర్శకుడు రాజ్ నిడిమోరుని పెళ్లాడారు. మరికొందరు కూడా ఇదే దారిలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఊపులో ఉన్నారు మీనాక్షి చౌదరి. సీనియర్ హీరోలు, జూనియర్ హీరోలు.. అందరికీ మీనాక్షియే కావాలి. గతేడాది సంక్రాంతికి వస్తున్నాంతో హిట్ అందుకున్న మీనాక్షి .. ఈ సంక్రాంతికి ఒకరాజు ఒకరాణి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అయితే మీనాక్షి ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ వస్తున్నాయి. తాజాగా అనగనగా ఒకరాజు ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి తన పెళ్లి, కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Meenakshi Chaudhary Opens Up About Marriage Career and Wedding Rumours

అనగనగా ఒకరాజులో మీనాక్షి చౌదరి, నవీన్ పొలిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మారి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అనగనగా ఒకరాజు సినిమాకు వై యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న అనగనగా ఒకరాజు ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా ఇంటర్వ్యూలో మీనాక్షి చౌదరి మాట్లాడుతూ.. రియల్ లైఫ్‌లో ఎలాగూ లేదు కదా, అందుకు రీల్ లైఫ్‌లో పెళ్లి చేసుకుని శాటిఫై అవుతున్నా. నా ఫ్రెండ్స్‌లో అందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. నేను ఒక్కదానినే పెళ్లిళ్లకు గెస్ట్‌లా వెళ్తున్నా. నన్ను పెళ్లికూతురిగా చూడాలని మా అమ్మ కోరిక. పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోయింది, పెళ్లి అవసరం లేదు. డ్రెస్సింగ్ అవ్వడం కానీ, అందంగా కనిపించాలని కూడా లేదు. పెళ్లంటే బోర్.. పెళ్లి అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఇందులో లాస్ ఉంటాయి, ప్రాఫిట్స్ కూడా ఉంటాయి. అది ఒక మిక్స్ బ్యాగ్. అన్ని ఆలోచించుకుని ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌‌లోకి వెళ్లాలి. అప్పటి వరకు పెళ్లికి బయటి నుంచి చప్పట్లు కొట్టి ఎంజాయ్ అని మీనాక్షి అన్నారు.

నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనే దానిపై ఇప్పటికే రకరకాల రూమర్స్ వచ్చాయి. ఏదైనా ఉంటే నేనే చెబుతా. దానికి ఇంకా టైం ఉంది. నవీన్ పోలిశెట్టి గారు ఆన్ స్క్రీన్ ఫుల్ ఫన్‌గా ఉంటారు.. కానీ ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం తన క్యారెక్టర్ గురించి, సీన్స్ గురించి సీరియస్‌గా డిస్కస్ చేస్తుంటారు. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. ప్రస్తుతం పెళ్లిపై నాకు ఏ ఉద్దేశం లేదు. కాకపోతే పెళ్లి అనేది జీవితంలో ఇంపార్టెంట్ డెసిషన్. మీ పేరెంట్స్, అన్నదమ్ములు ఎలా ఉండాలి అనేది మీ చేతుల్లో లేదు. కానీ లైఫ్ పార్ట్‌నర్ మాత్రం మీ చేతుల్లోనే ఉంది. మీ లైఫ్ పార్ట్‌నర్ మీ జీవితాన్ని కూడా డిసైడ్ చేస్తారు. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. ఒకవేళ పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజే చేసుకుంటా. పార్ట్‌నర్‌ని ఫ్రెండ్‌లా చూడండి. కాబోయే భర్త ఎలా ఉండాలని యాంకర్ ప్రశ్నించగా.. మంచి అబ్బాయి అయ్యుండాలి, బాగా హైట్ ఉండాలి. మంచి హృదయం, జెంటిల్మెన్‌లా ఉండాలి. అందరితో బాగుండాలి. సాంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకుంటానని మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చారు.

More from Filmibeat

Read more about: meenakshi chaudhary sushanth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X