Meenakshi Chaudhary : బ్లూకలర్ ఔట్‌ఫిట్‌లో లక్కీ భాస్కర్ హీరోయిన్ .. భారీ అందాలతో పిచ్చెక్కిస్తోన్న మీనాక్షి

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన లక్కీ భాస్కర్ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజై విజయవంతంగా దూసుకెళ్తోంది . సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా లక్కీ భాస్కర్ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఘన విజయం కావడంతో మీనాక్షి కెరీర్ కొత్త టర్న్ తీసుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

హర్యానాలోని పంచకులలో జన్మించిన మీనాక్షి చౌదరిది మిలటరీ కుటుంబం. ఆమె తండ్రి దివంగత బీఆర్ చౌదరి భారత సైన్యంలో కల్నల్‌ హోదాలో పనిచేశారు. చండీగఢ్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిన మీనాక్షి మంచి క్రీడాకారిణి కూడా. స్టేట్ లెవల్ స్విమ్మర్, బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా ఆమె రాణించారు. డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో బీడీఎస్ పూర్తి చేశారు మీనాక్షి చౌదరి. 2017లో మిస్ ఐఎంఏ (ఇండియన్ మిలటరీ అకాడమీ) పోటీల్లో పాల్గొన్నారు.

Meenakshi Chaudhary PhotoShoot with blue color outfit Her latest photos here

తర్వాత 2018లో ఫెమినా మిస్ హర్యానా టైటిల్ గెలుచుకున్న మీనాక్షి చౌదరి .. అనంతరం హర్యానా తరపున మిస్ ఇండియా పోటీలలో ప్రాతినిథ్యం వహించారు. ఆ పోటీలలో ఆమె ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. మోడల్‌గా అనేక ఫేమస్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా పనిచేసిన మీనాక్షి చౌదరికి అప్‌స్టార్ట్స్ అనే హిందీ సినిమాలో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఆ వెంటనే ఖిలాడీ, హిట్ 2, కొలై, గుంటూరు కారంలో నటించారు. ఖిలాడీలో రొమాంటిక్ సీన్స్‌లో నటించినా ఆమెకు హిట్ దక్కలేదు. కానీ పాపులారిటీ మాత్రం సొంతం చేసుకుంది.

తెలుగులో వచ్చిన పాపులారిటీతో తమిళ్‌లోనూ ఆమె అవకాశాలు అందుకున్నారు. ఏకంగా ఇళయ దళపతి విజయ్ నటించిన ది గోట్ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మీనాక్షికి లక్కీ భాస్కర్ రూపంలో ఘన విజయం దక్కింది. 27 ఏళ్ల వయసులోనే ఓ బిడ్డకు తల్లిగా నటించడానికి ఏమాత్రం నో చెప్పకపోవడం, తన పెర్ఫార్మెన్స్ చూపించుకోవడానికి ఛాన్స్ దక్కడంతో మీనాక్షి అద్భుతంగా నటించింది.

త్వరలో ఆమె నటించిన వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్‌సేన్ మెకానిక్ రాకీలపైనే భారీ అంచనాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభరలోనూ మీనాక్షి కీలకపాత్ర పోషిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి హిట్ అయినా ఆమె స్టార్ హీరోయిన్ దిశగా అడుగులు వేయడం ఖాయం. అంతేకాదు.. ఇంకొన్నేళ్ల పాటు ఆమెకు తెలుగు తెరపై మరింత కాలం ఢొకా లేనట్లే. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మీనాక్షి చౌదరి ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులను , వ్యక్తిగత వివరాలను పంచుకుంటారు. తాజాగా బ్లూ కలర్ ఔట్‌ఫిట్‌లో తన నాభి, ఎద అందాలు చూపిస్తూ మీనాక్షి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ చూసేయండి.

More from Filmibeat

Read more about: meenakshi chaudhary
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X