ఆ హీరోతో పెళ్లి నిజమేనా.. ? నటి మీనాక్షి చౌదరి క్లారిటీ..
Meenakshi Chaudhary: టాలీవుడ్ యంగ్ అండ్ బ్యూటీ హీరోయిన్ మీనాక్షి చౌదరి వరుస సినిమాలతో బిజీ బిజీగా మారింది. అయితే గత కొంతకాలంగా ఈ అమ్మడు పెళ్లి గురించి కొన్ని రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఇటీవల అక్కినేని హీరోను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనీ, వారిద్దరూ ఎన్నో ఏండ్లుగా ప్రేమించుకుంటున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. త్వరలో మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారంటూ రూమర్స్ నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ రూమర్స్ పై తాజాగా నటి మీనాక్షి చౌదరి క్లారిటీ ఇచ్చింది.
మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరస ప్రాజెక్టులు చేస్తూ.. ఫుల్ స్పీడ్ లో ఉంది. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్లతో దూసుకు వెళుతుంది. దళపతి విజయ్ ' గోట్ ' మూవీతో ఈ అమ్మడుకు తెగ పాపులర్టీ వచ్చింది. ఇటీవల లక్కీ భాస్కర్ మూవీ సక్సెస్ కూడా ఈ బ్యూటీ కి కలిసి వచ్చింది. ప్రస్తుతం హీరో విశ్వక్ సేన్ తో కలిసి మెకానిక్ రాఖీ అనే సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ తర్వాత విక్టరీ వెంకటేష్- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమాలో కూడా మీనాక్షి చౌదరి లీడ్ రోల్ లో కనిపించబోతుందట.

ఇలా వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు.. టాలీవుడ్ హీరో సుశాంత్ తో ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజాగా.. మీనాక్షి చౌదరి పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది. హీరో విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకి సినిమా ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ .. తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదని, అవన్నీ ఫేక్ అంటూ తేల్చేశారు. తొలుత ఆ వార్తలను చూసి తాను కూడా షాక్ అయ్యానని ఫీలయ్యారు.
ఇటీవల తనపై తరచూ ఇలాంటి రూమర్సు స్ప్రెడ్ అవుతున్నాయని, గతంలో ఓ తమిళ హీరోని పెళ్లి చేసుకోబోతున్నానంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయని , ఇలా ప్రతి నెల ఏదోక రూమర్ వస్తుందని మీనాక్షి చౌదరి బాధపడ్డారు. గతంలో సలార్ మూవీ లో నటించేటప్పుడు కూడా ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయని, కానీ ఇలాంటి రోమర్సును తాను అసలు పట్టించుకోనని మీనాక్షి చౌదరి తెలిపారు.

తాను సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటానని, తన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటానని, ఇలాంటి రోమర్సును ఫ్యాన్స్ కూడా పట్టించుకోవద్దని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. అలాగే ప్రస్తుతం తాను కెరీర్ పై ఫోకస్ చేశానని, ప్రస్తుతం సింగిల్ .. నాట్ రెడీ టు మింగిల్ అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది మీనాక్షి చౌదరి .


Click it and Unblock the Notifications











