గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా..?

మీనాక్షి చౌదరి.. తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. అద్బుతమైన అందం, అంతకు మించిన నటనతో కుర్రకారు గుండల్లో హాట్ ఫెవరెట్ అయిపోయిన ఈమెకు పెద్ద ఎత్తునే ఫ్యాన్స్ ఉన్నారు. 2021లో ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ఖిలాడి సినిమాలోనూ కనిపించి మెస్మరైజ్ చేసింది. ఇక ఆ తర్వాత అడవి శేష్ ప్రియురాలిగా హిట్: ది సెకండ్ కేస్ సినిమాలోనూ కనిపించి అందరినీ కవ్వించింది.

ఈ సినిమా చూసిన ప్రతీ యువకుడు మీనాక్షి చౌదరి లాంటి అమ్మాయే ప్రియురాలు కావాలని కలలు కన్నారు. అంతటి రెస్పాన్స్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అవకాశం దక్కించుకుంది. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. మొదటి హీరోయిన్ గా టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ క్యూట్ హీరోయిన్ శ్రీలీల ఎంపిక అవగా.. రెండో హీరోయిన్ గా మీనాక్షి నటించింది. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా జనవరి 12వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Recommended Video

Guntur Kaaram Bookings USA లో Mahesh Babu Movie కి ఎన్ని కోట్ల కలెక్షన్లంటే? | Telugu Filmibeat

Meenakshi Chaudhary Remuneration For Mahesh Babu Guntur Kaaram Movie Check Details

గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరిలతో పాటు ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ వంటి స్టార్ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. శ్రీమతి మమత సమర్పణలో హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఈ చిత్రానికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ వివరాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సినిమాలో నటించేందుకు మేహష్ బాబు అత్యధికంగా 78 నుంచి 80 కోట్ల రూపాయలు పుచ్చుకుంటుండగా.. శ్రీలీల 4 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా నటించిన హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఏకంగా కోటి నుంచి రెండు కోట్ల రూపాయల మధ్య పారితోషికం పుచ్చుకుంటుంద. కచ్చితంగా అంటే కోటిన్నర అందుకుంటోంది.

Meenakshi Chaudhary Remuneration For Mahesh Babu Guntur Kaaram Movie Check Details

200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే అంచనాలు నమోదు అయ్యాయి. ముఖ్యంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కాంబోల దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ సినిమా వస్తుండడంతో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు విడుదల కాగా విపరీతమైన రెప్సాన్స్ వచ్చింది. కుర్చి మడత పెట్టి సాంగ్ అయితే యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. మరి జనవరి 12న విడుదల కాబోయే ఈ సినిమా బాక్సాఫీసు ఏ విధంగా బద్ధలు చేస్తుందో చూడాల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X